YSRCP Neglects Electronics Manufacturing Cluster: రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం 2015లో హయాంలో రేణిగుంట విమానాశ్రయానికి ఎదురుగా శ్రీవేంకటేశ్వర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను 122 ఎకరాల్లో ప్రారంభించింది. 2019కి ముందే కార్బన్, సెల్‌కాన్ సంస్థలు మెబైల్ తయారీ యూనిట్లు ప్రారంభించాయి.
ఓపో, రియల్‌మీ ఫోన్ల తయారీ సంస్థ విన్‌టెక్, కార్బన్ అనుబంధ సంస్థ నియోలింక్స్, ప్రముఖ బ్రాండ్ల సెల్‌ఫోన్లకు కెమెరా లెన్స్ తయారు చేసే సన్ని ఓపోటెక్, యాపిల్ ఉత్పత్తులకు కేబుళ్లు-ఛార్జర్లు తయారు చేసే ఫాక్స్‌లింక్ యూనిట్లూ ఏర్పాటయ్యాయి. ఆయా యూనిట్లలో 80 శాతం వరకూ ఉద్యోగాలను పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికే కేటాయించారు! అక్కడున్న మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రోత్సాహంతో మరికొన్ని సంస్థలు ఆసక్తి చూపడంతో రెండోదశ క్లస్టర్‌కు చంద్రబాబు 502 ఎకరాలు కేటాయించారు. 2019 ఫిబ్రవరిలో ఈఎంసీ (Electronics Manufacturing Cluster)-2 క్లస్టర్‌కు భూమిపూజ చేశారు.
ఐటీని చావుదెబ్బ కొట్టిన జగన్ సర్కార్- పెట్టుబడుల ఆకర్షణలో అట్టడుగున రాష్ట్రం
2019 ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యాక రేణిగుంటలోని ఈఎంసీ జాతకం తిరగబడింది. చంద్రబాబు ప్రారంభించిన ప్రాజెక్టుల్ని అటకెక్కించడమే పనిగా పెట్టుకున్న జగన్, ఆ పారిశ్రామికవాడను విస్తరించలేదు! అసలు గుర్తించడానికే ఇష్టపడలేదు. రేణిగుంట విమానాశ్రయంలో ఎప్పుడుదిగినా ఈ క్లస్టర్‌ను చూసుకుంటూ వెళ్లారేగానీ, దాని అభివృద్ధిపై శ్రద్ధ వహించలేదు. వైఎస్సార్సీపీ పిశాచ గణాలు కూడా అందులోని కంపెనీలపై పెత్తనం చెలాయిండం ప్రారంభించాయి. ఆయా కంపెనీల్లో క్యాంటీన్ కాంట్రాక్టులు, కొత్తగాచేపట్టే నిర్మాణాలకు ఇసుక, మట్టి పనుల కాంట్రాక్టులు తమకు నచ్చివారికే ఇవ్వాలంటూ యాజమాన్యాయాలపై వైఎస్సార్సీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు!
అడిగిన రేటుకు ఇచ్చేయండంటూ, కొన్ని కంపెనీలకు హుకుం జారీచేశారు! తమకు నచ్చినవారిని పంపి, ఉద్యోగాలివ్వాల్సిందేనంటూ పట్టుబట్టేవారు! ఇవన్నీ భరించలేకపోతున్నామని ఈఎంసీ నిర్వాహకులు తాడేపల్లి ప్యాలెస్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఏదో ఒకటి చేసుకోండి, నా వరకూ మాత్రం రానీయకండి’ అని ముఖ్యనేత చేతులెత్తేయడం వైఎస్సార్సీపీ నాయకులకు ఇంకా అలుసుగా మారింది. వైఎస్సార్సీపీ సర్కారు పుణ్యమా అని చంద్రబాబు హయాంలో ఒప్పందం చేసుకున్న టి మొబైల్, విన్‌టెక్, టీసీఎల్ వంటి సంస్థలు మినహా కొత్తగా ఒక్కప్లాంట్ కూడా రాలేదు.
బిమారు రాష్ట్రాల కంటే ఏపీ వెనుకబాటు - ఐటీ రంగంలో అధమ స్థానంలో రాష్ట్రం
వైఎస్సార్సీపీ నేతల అరాచకాలకు అడ్డుచెప్పేవారే లేకపోవడంతో, వివిధ సంస్థలు బెదిరిపోయాయి! శ్రీకాళహస్తి సమీపంలోని ల్యాంకో పైపుల తయారీ సంస్థ నిర్వాహకులు కూడా వైఎస్సార్సీపీ నాయకులు అడిగినప్పుడల్లా ముడుపులు సమర్పించుకున్నారు. నేతలు చెప్పిన పనులూ చేసిపెట్టారు! ఆగడాలు మరీ మితిమీరడంతో చివరకు ప్లాంటునే మూసేసి వెళ్లిపోయారు.
తిరుపతిలో భారీ ఎలక్ట్రానిక్స్ ప్లాంటు ఏర్పాటుకు అప్పట్లో ముందుకొచ్చిన వోల్టాస్, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు, విడిభాగాలు తయారీ యూనిట్లు నెలకొల్పుదామనుకున్న 15 సంస్థలూ పారిపోయాయి. ఫాక్స్‌లింక్ కూడా కొన్ని కార్యకలాపాలను బెంగళూరుకు తరలించేసింది. చంద్రబాబు హయాంలో శ్రీసిటీ సెజ్‌లో 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన ఫాక్స్‌కాన్ సంస్థ ఇక్కడి కార్యకలాపాల్లో కొంతభాగాన్ని తమిళనాడుకు తరలించిందని తెలుస్తోంది. ఫలితంగా స్థానికంగా ఉద్యోగాల్లో కోతపడింది.
IT Sector in AP: అంకురాలను చిదిమేసిన వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో జాడలేని ఐటీ రంగం
ఈఎంసీ రెండు క్లస్టర్లలో ఏర్పాటయ్యే యూనిట్లతో కనీసం 50 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తొలుత అంచనా వేశారు. కానీ, ఇప్పుడు 15 వేల మందికి మించి పనిచేయడం లేదు. ఫలితంగా వేలకోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో తిరుపతి ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్‌లోని డిక్సన్ టెక్నాలజీస్ నెలవారీ టర్నోవర్ 346 కోట్లు, సన్ని ఓపోటెక్ టర్నోవర్ 123 కోట్లు, ఫాక్స్‌లింక్ ఇండియా టర్నోవర్ 63 కోట్లుగా నమోదైనట్లు తెలుస్తోంది.
అంటే, ఈ మూడు సంస్థల వార్షిక టర్నోవర్ కలిపితేనే సుమారు 6 వేల 400 కోట్లు. అదే చంద్రబాబు హయాంలో ఒప్పందం చేసుకున్న కంపెనీలన్నీ ప్లాంట్లు నెలకొల్పి, జగన్ సర్కారు ఇక్కడ మరికొన్ని సంస్థలను తీసుకొచ్చి ఉంటే టర్నోవర్ వేల కోట్లకు వెళ్లేది. ప్రభుత్వానికీ పన్నుల రూపేణా ఆదాయం సమకూరేది! సెమీకండక్టర్ రంగానికి ఇప్పుడు కేంద్రం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకుని, ఎలక్ట్రానిక్స్ సంస్థలకు కీలకమైన సెమీ కండక్టర్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ కంపెనీలను తెచ్చి ఉంటే వేలాది ఉద్యోగాలు లభించేవి! అలాంటి ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఊపిరితీసి నిరుద్యోగులకు ఎనలేని నష్టాన్ని కలిగించింది జగన్ సర్కారు.
No Development in IT Sector: కాన్సెప్ట్ నగరాల ఊసే లేదు.. ఐటీ రంగంలో అభివృద్ధి లేదు..