ETV Bharat / state

వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు కార్యక్రమం - యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన - YCP Leaders Violated Election Code - YCP LEADERS VIOLATED ELECTION CODE

YSRCP Leaders Violated Election Code: రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్‌ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం వ్యవహరించింది. నామినేషన్ల ప్రక్రియలో వైఎస్సార్సీపీ నేతలు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘిస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చినా పోలీసులు అధికార పార్టీ సేవలోనే తరిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. కొందరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

YSRCP Leaders Violated Election Code
YSRCP Leaders Violated Election Code
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 2:26 PM IST

YSRCP Leaders Violated Election Code : రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్‌ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది. నామినేషన్ల ప్రక్రియలో వైఎస్సార్సీపీ నేతలు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలకు పాతరేస్తూ నామినేషన్ల వేళ అభ్యర్థులు పార్టీ జెండాలతో రెచ్చిపోతున్నారు. నామినేషన్‌ వేయడంలో అడుగడుగునా కోడ్‌ ఉల్లంఘన కనిపించింది. వైఎస్సార్సీపీ నేతలను అధికారులు కూడా ఆపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోటిఫికేషన్ వచ్చినా పోలీసులు అధికార పార్టీ సేవలోనే తరిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే కొందరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వైఎస్సార్సీపీ నేతల నామినేషన్‌ దాఖలు - యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన

జోగి రమేష్ : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగి రమేష్ నామినేషన్ సందర్భంగా యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరుగుతోంది. గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనాలను తరలించి మనిషికి 500, మద్యం, బిర్యానీ, అందజేసినట్లు చెబుతున్నారు. ర్యాలీకి వచ్చిన కార్యకర్తలు రోడ్డుపై విన్యాసాలు చేస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేశారు. పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్​లో ఇరుక్కుపోయిన ఉద్యోగులు, విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయారు.

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ నేతలు - నామినేషన్ వేసేందుకు వెళ్తూ - Election Code violation

మొండితోక జగన్మోహన్ రావు : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు నామినేషన్ సందర్భంగా అడుగడుగునా వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని స్థానికులు మండిపడ్డారు. ఎన్నికల అధికారి ఉన్నప్పటికీ మున్సిపల్ కార్యాలయాన్ని వైఎస్సార్సీపీ నాయకుల వాహనాల పార్కింగ్‌కు వినియోగించడంపై ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు ఇరువైపులా వైఎస్సార్సీపీ రంగులు వేయడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా డీజే వాహనాలను వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

రాచమల్లు శివప్రసాద్​ రెడ్డి : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వైసీపీ ఎలక్షన్ ఏజెంట్ వెంకటరామిరెడ్డిపై మూడో పట్టణ ఠాణాలో పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్​ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో సుబ్బిరెడ్డి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి ఎన్నికల కోడ్​ను ఉల్లఘించారు. దీనిపై ఎన్నికల ప్లైయింగ్ స్క్వాడ్ అధికారి శ్రీనివాసులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కోడ్​ను ఉల్లంఘించిన రాచమల్లు - ఆధారాలతో సహా 'సీ-విజిల్​'లో ఫిర్యాదు - Code Violation In Proddatur

మేకపాటి రాజమోహన్ రెడ్డి : మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నెల్లూరు జిల్లా మర్రిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆత్మకూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ వెంకటరమణమ్మ ఫిర్యాదు చేశారు. తాజాగా వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరానని తనపై వ్యక్తిగత దూషనలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. అనుమతులు లేకుండా ప్రచారం చేయడంపై స్థానిక ఎమ్​పీడీఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఎన్నికల కోడ్​ను ఉల్లఘించిన వైసీపీ అభ్యర్థి - చర్యలకు ఈసీ ఆదేశం - Election Code Violation

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.