YSRCP Leaders Illegal Sand Mining: ఇసుక దోపిడీ నిజం. నదులు, వాగులు, వంకల్ని పిండేస్తున్న శాండ్ మాఫియా అక్రమాలు వాస్తవం. ఒక్కచోట కాదు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇదే విధ్వంసం. స్వయాన కేంద్రం పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖనే హైకోర్టుకు వెల్లడించిందీ సత్యం. మరిప్పుడేం సమాధానం చెబుతుంది జగన్ ప్రభుత్వం. వ్యవస్థల కళ్లకు గంతలు కట్టి, కోర్టుల్ని ధిక్కరించి మరీ సాగుతున్న ఈ ముఠాల వెనకున్నది ఎవరు. అడ్డొచ్చిన వారిని, ప్రశ్నించిన వారిని చంపడానికి కూడా వెనకాడని బరితెగింపు వాళ్లకెలా వచ్చింది. వందలు, వేల కోట్ల రూపాయల ఇసుక బొక్కేస్తున్న ఆ దొంగల ముఠాల్ని అడ్డుకోవడం అధికార యంత్రాంగానికి ఎందుకు చేతకావడం లేదు. ఈ అంశంపై నేటి ప్రతిధ్వని చర్య కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకటేశ్వర్లు, ఇసుక అక్రమాలపై కేసులు నమోదు చేసిన దండా నాగేంద్ర పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఇసుక అక్రమాలు నిజం, నిబంధనలు, అనమతులు పట్టకుండా భారీ యంత్రాలతో తవ్వి తరలిస్తున్నారని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే నిర్థరించింది. కేంద్ర పర్యవరణ అటవీ మంత్రిత్వశాఖ ఆ మేరకు హైకోర్టుకే వివరాలు తెలిపింది. రాష్ట్రాన్ని ఇసుక దొంగలకు వదిలిపెట్టిన వైనంపై జగన్ ప్రభుత్వం ఏం సమాధానాలు ఇస్తుందని ఈ కార్యక్రమంలో చర్చించారు.
అంతా జగన్నాటకం - ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం అవే పాత అబద్ధాలు!
రాష్ట్రంలో ఇసుక అక్రమాలపై కొంతకాలంగా నాగేంద్ర న్యాయపోరాటం చేస్తున్నారు. ఆ కారణంగా అధికార పార్టీ నుంచి వేధింపులూ ఎదుర్కొంటున్నారు. అసలు ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణపై క్షేత్రస్థాయిలో మీరు గమనించిన ఉల్లంఘనలు ఏమిటి. ఈ మొత్తం స్వాహా రాజ్యంలో ఎవరెవరి పాపం ఎంత ఉందనే అశంపై ఆయన వివరాలు అందించారు.
అధికార వైఎస్సార్సీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్న ఈ ఇసుక దోపిడీపై ప్రశ్నించిన వారిని చంపేందుకు కూడా వెనకాడడం లేదు ఆ మాఫియా. ఇసుక అక్రమ తవ్వకాల ఫొటోలు, వీడియోలు తీసినందుకు ఈనాడు విలేకరిపైనా బుధవారం వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు. అసలు వాళ్లకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోందని చర్చించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వైఎస్సార్సీపీ నేతలు ఇసుక మాఫియాగా మారి దోపిడీ చేస్తున్నారు: సీపీఎం
ఇటీవల తమిళనాడులో ఇసుక అక్రమ తవ్వకాలపై ఈడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. 5జిల్లాల కలెక్టర్లపై కేసులు సైతం నమోదు చేసింది. ఏపీలో జరుగుతున్న ఇసుక దోపిడీ తమిళనాడు కంటే ఎన్నో వందల రెట్లు ఎక్కువ. ఐనా వీళ్లు ఎందుకు కనీసం స్పందించడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిజమని చెప్పిన అక్రమాలు వాళ్ల కళ్లకు ఎందుకు కనిపించడం లేదు.
అసలు గత ప్రభుత్వ హయాంలో ఉచితంగా లభించిన ఇసుక విధానంలో జగన్ సర్కారు వచ్చీ రాగానే ఎందుకు మార్పులు చేసింది. అయిదేళ్లుగా రాష్ట్రంలో ఇసుక లభ్యత ప్రభావం ఎలా ఉంది. ఇసుక వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రంలో ఆ ఇసుకే లేక నిర్మాణాలు ఆగి, పనులు కరవై కార్మికులు పస్తులు పడుకోవాల్సిన దుస్థితిని అసలు ఎలా చూడాలి అనే అంశంపై ఈ కార్యక్రమంలో చర్చించారు.
రీచ్‌లలో కలెక్టర్ల తనిఖీల హడావుడి - నిలువెత్తు ఇసుకలో 'నిజాలకు పాతర'!