ETV Bharat / state

కోళ్ల వ్యర్థాల్లోనూ కోట్లు ఆర్జించారు - నేతల మధ్య సెటిల్‌మెంట్‌ చేసిన కీలక నాయకుడు - YSRCP Chicken Waste Irregularities

YSRCP Corporators Poultry Waste Scam : గత ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కావు. ధనార్జన కోసం అడ్డదారులు తొక్కారు. ఈ క్రమంలోనే జీవీఎంసీలో కోళ్ల వ్యర్థాల తరలింపులో వైఎస్సార్సీపీ నేతలు బరితెగించారు. వాటిని అక్రమంగా రవాణా చేసి ఇతర జిల్లాల్లో చేపల చెరువులకు తరలించి కోట్లు ఆర్జించారు.

YSRCP Irregularities in Chicken Waste
YSRCP Irregularities in Chicken Waste (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2024, 11:20 AM IST

YSRCP Leaders Irregularities in Chicken Waste : వైఎస్సార్సీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. కాసుల వేట కోసం వారు చేసిన అక్రమాలు ఒక్కొటి వెలుగులోకి వస్తున్నాయి. కోళ్ల వ్యర్థాల్లోనూ వైఎస్సార్సీపీ నేతలూ డబ్బులు దండుకోవడం బయటికి వచ్చింది. మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఉత్పత్తయ్యే కోళ్ల వ్యర్థాలను నిబంధనల ప్రకారం కాపులుప్పాడ డంపింగ్‌ యార్డుకు తీసుకెళ్లాలి. చట్ట విరుద్ధంగా చేపల చెరువులకు తరలించారు. ఇలా ప్రజారోగ్యంతో చెలగాటమాడి రూ.కోట్లు ఆర్జించారు.

గత ప్రభుత్వంలో ముగ్గురు గుత్తేదార్లకు కోళ్ల వ్యర్థాల తరలింపు టెండరు దక్కించుకున్నారు. కానీ ఆర్నెళ్లలోనే పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. కోళ్ల వ్యర్థాలకు మంచి గిరాకీ ఉండటంతో, నాటి అధికార పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు రంగంలోకి దిగి దందాను సాగించారు. తమ వార్డుల్లో వ్యర్థాలు తామే తీసుకుంటామంటూ గుత్తేదార్లకు తెలిపారు. కోళ్ల వ్యర్థాల విక్రయాల్లో మధురవాడ, భీమిలి, ఎంవీపీకాలనీ, తాటిచెట్లపాలెం, కంచరపాలెం, గాజువాక ప్రాంతాల్లోని కొందరు కార్పొరేటర్ల హస్తం ఉందన్న విమర్శలు ఉన్నాయి. వైఎస్సార్సీపీలో కోళ్ల వ్యర్థాల చిచ్చు రేగడంతో, ఒక దశలో ఆ పార్టీ కీలక నాయకులూ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

అందుకే పోటీ : విశాఖలో ఉత్పత్తయ్యే కోళ్ల వ్యర్థాలను ఉమ్మడి విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్ని ప్రత్యేక రోజుల్లో భారీ విక్రయాలతో ఎక్కువ మొత్తంలో వ్యర్థాలు సమకూరుతున్నాయి. పైగా వీటికోసం చేపల చెరువుల యజమానుల మధ్య పోటీ ఉంది. దీంతో కోళ్ల వ్యర్థాలకు డిమాండ్‌ పెరిగి భారీ ఆదాయం వస్తుండటంతో కొందరు కార్పొరేటర్లు పోటీపడుతున్నారు.

వ్యర్థాల సేకరణ ఇలా : టన్ను కోళ్ల వ్యర్థాల సేకరణకు గాను దుకాణదారు నుంచి రూ.700 వసూలు చేస్తారు. దానిలో జీవీఎంసీకి రూ.530 చెల్లించి, మిగతా నిధులు గుత్తేదారు తీసుకునేలా టెండర్లు పిలుస్తారు. దుకాణదారు నుంచి నిధులు వసూలు చేయడం పక్కనపెడితే, తిరిగి వారికే కొంత డబ్బు ముట్టజెబుతున్నారు. సేకరించిన వ్యర్థాలు కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు తరలించాల్సి ఉండగా, వాహనాలన్ని ఓ నిర్మానుష్య ప్రాంతంలో నిలిపి వ్యర్థాలు గ్రేడ్‌ చేసి తరలిస్తున్నారు.

టెండర్లపై నాయకుల గురి : మహా విశాఖ నగరపాలక సంస్థలో రెండు సంవత్సరాల తర్వాత కోళ్ల వ్యర్థాలకు టెండర్లు పిలిచారు. దీంతో కొందరు ప్రజాప్రతినిధులతో సిఫార్సులు చేయించి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. మరికొందరు కార్పొరేటర్లు వాటిని దక్కించుకునేందుకు దగ్గరుండి వ్యాపారులతో బిడ్లు వేయించడం గమనార్హం. అయితే ఈ-టెండరు విధానం అమలు చేసి, నిబంధనలు పెట్టడంతో ఆశావహులకు చుక్కెదురైంది. తమకు తెలియకుండా టెండర్లు ఎలా పిలుస్తారంటూ? అధికారులపై కొందరు కూటమి కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో గడువు తేదీని పొడిగించారు. దాఖలైన టెండర్లను ఇంకా తెరవాల్సి ఉంది.

అంబటి రాంబాబు సోదరుడి అక్రమ లీలలు - అనుమతులు లేకుండానే భారీ అపార్ట్‌మెంట్‌ నిర్మాణం - Ambati MuraliKrishna Irregularities

అనంతపురం జిల్లాలో ఆగని అమిగోస్‌ అరాచకాలు - మైనింగ్ రాయల్టీ పేరుతో దొంగ రశీదులు - Amigos Mining Royalty Scam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.