YSRCP Leaders Attack on TDP Followers in Nandyal District : దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలతో ఐదేళ్లుగా పేట్రేగిపోయిన వైఎస్సార్సీపీ మూకలు, అధికారం కోల్పోయాక కూడా తగ్గేదేలే అంటూ అదే దమనకాండ కొనసాగిస్తున్నాయి. టీడీపీ నాయకులపై దాడులు చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. వాళ్ల దాడిలో కొందరు చనిపోతుంటే, మరికొందరు ఆసుపత్రిల్లో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగింది కానీ వారి దాడుల నుంచి కాదనీ ప్రజలు భావిస్తున్నారు.
మారని తీరు : గత ఐదేళ్ల పరిపాలనలో మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రాణాలు అరిచేతుల్లో పట్టుకొని బిక్కు బిక్కు మంటూ కాలం గడిపారు. జూన్ 4న విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం మారింది కానీ వైఎస్సార్సీపీ నాయకులు బుద్ధి మాత్రం మారలేదు. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ నాయకులపై దాడి చేసిన సంఘటన కోకొల్లలుగా ఉన్నాయి. ఇలాంటి సంఘటనలో ఒకటే నంద్యాల జిల్లాలో జరిగిన దాడి.
చిత్తూరు 'పెద్దారెడ్డి' లీల - అధికారుల అండతో 982 ఎకరాలు కాజేశారు - YSRCP land irregularities
కర్రలతో దాడి : నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోతుదొడ్డి గ్రామంలో టీడీపీ నాయకులపై వైఎస్సార్సీపీ నాయకులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గ్రామానికి సమీపంలో ఉన్న ఫ్యాక్టరీని నిలిపివేయాలని పది రోజుల క్రితం యాజమాన్యం వద్ద నిరసన తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పీర్ల పండగ సందర్భంగా గ్రామంలో వైఎస్సార్సీపీ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు టీడీపీ అనుచరులపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో నారాయణ, ఓబులేసు, శ్రీనివాసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరికి చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
"మా ఊరికి సమీపంలో కంకర ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే డస్ట్ కారణంగా రైతులకు ఇబ్బంది కలుగుతుంది. దీనిని నిలిపివేయాలని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అడిగాం. దీనిని దృష్టిలో పెట్టుకొని.. ఎవరి అనుమతితో గ్రామంలో పీర్ల పండుగ చేస్తున్నారని గ్రామ పెద్దలను బహిష్కరించి గుడి తాళాలు వేశారు. సుమారు 60, 70 మందితో మాపై దాడి చేశారు. వీరి వల్ల గ్రామంలో సామాన్యులు బతకడం చాలా కష్టంగా ఉంది" -నారాయణ, పోతుదొడ్డి గ్రామస్థుడు