YSRCP INCHARGES 5TH LIST RELEASE: పార్లమెంటు, అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌ల ఐదో జాబితాను వైఎస్సార్సీపీ విడుదల చేసింది. నాలుగు ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌ల పేర్లను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా చలమలశెట్టి సునీల్ పేరును ఖరారు చేసినట్లు తెలిపారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా మద్దెల గురుమూర్తి పేరును ప్రకటించారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా సింహాద్రి రమేష్ బాబును ఖరారు చేస్తూ వైఎస్సార్సీపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇక నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ పేరును ఖరారు చేసినట్లు బొత్స ప్రకటించారు.
YSRCP 2024 MLA Candidates First List వైసీపీ ఎమ్మెల్యేల ఫస్ట్ లిస్ట్‌కు ముహుర్తం ఫిక్స్..! వారికి ఝలక్ ఇవ్వనున్న సీఎం జగన్..!
అసెంబ్లీ టికెట్: అరకు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌గా రేగం మత్స్యలింగం పేరును ఖరారు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. సత్యవేడు అసెంబ్లీ నియోజకర్గ ఇన్‌ఛార్జ్‌గా నూకతోటి రాజేష్, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా సింహాద్రి చంద్రశేఖరరావు పేరును ప్రకటించారు. మెుత్తంగా వైఎస్సార్సీపీ ప్రకటించిన ఐదో లిస్ట్‌లో ముగ్గురు కొత్తవారికి చోటు కల్పించింది.
27 మందితో వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితా విడుదల
ఐదు జాబితాల వివరాలు: వైఎస్సార్సీపీ ప్రకటించిన తొలి జాబితాలో మెుత్తం 11 అసెంబ్లీ స్థానాల్లో సమన్వయకర్తలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రెండో జాబితాలో మరో 27 స్థానాలకు(3 ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు(6 ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో జాబితాలో 8 స్థానాలకు(1 ఎంపీ, 8 అసెంబ్లీ) ఐదో జాబితాలో ఏడు స్థానాలకుగాను (4ఎంపీ, 3 అసెంబ్లీ) స్థానాలతో జాబితాలు విడుదల చేసింది.
పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా
రీజినల్ కో-ఆర్డినేటర్లకు బాధ్యతలు: అంతే కాకుండా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో అసంతృప్తి నేతల తిరుగుబాటు కారణంగా పలుచోట్లు కోఆర్డినేటర్ల మార్పులు చేర్పులతో పాటుగా బుజ్జగింపుల పర్వానికి తెరతీసింది. గుంటూరులో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి అదనంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి అలక నేపథ్యంలో ఆ పార్లమెంట్ నియోజకవర్గ రీజినల్ కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పింది. సంతనూతలపాడు, కందుకూరు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు రీజినల్ కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమిస్తూ వైసీపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.
వైఎస్సార్సీపీ నాలుగో జాబితా- ఈసారి కరివేపాకులు కూడా ఎస్సీలే! వాళ్లకే ఇస్తే బలపడతారు-నిలబడతారనే భయమా!