ETV Bharat / state

జగన్​ హయాంలో కష్టాల ఊబిలో ఆర్టీసీ - కొత్త ప్రభుత్వం ఏం చేయనుంది! - YSRCP Govt Neglect RTC Buses - YSRCP GOVT NEGLECT RTC BUSES

YSRCP Govt Neglect RTC Buses : వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ఆర్టీసీని కష్టాల ఊబిలోకి నెట్టింది. జగన్ సర్కార్​ ఐదేళ్లలో కొత్త బస్సుల ఊసే ఎత్తలేదు. పాత బస్సులకే పైపై మెరుగులు దిద్ది ఆర్టీసీ బస్సుల సర్వీసులను కొనసాగించారు. కూటమి ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలుపై దృష్టి పెట్టాలని ఆర్టీసీ సిబ్బంది కోరుకుంటున్నారు.

rtc_buses_ap
rtc_buses_ap (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 11, 2024, 3:09 PM IST

YSRCP Govt Neglect RTC Buses : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, సుఖమయం ఇది రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ నినాదం. సొంత వాహనాలు ఉన్నా ఎక్కువ మంది ఆర్టీసీ బస్సు ప్రయాణానికి మెుగ్గు చూపుతుంటారు. గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అసంబద్ధ విధానాలతో సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. డొక్కు బస్సులకే పైపై మెరుగులు దిద్ది నడపడంతో ఆర్టీసీ ప్రయాణం అంటే గాలిలో దీపంలా మారింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీని ప్రగతిబాట పట్టించాలని సిబ్బంది కోరుతున్నారు.

జగన్​ హయాంలో కష్టాల ఊబిలో ఆర్టీసీ - కొత్త ప్రభుత్వం ఏం చేయనుంది! (ETV Bharat)

YSRCP Govt Not Introduce New Buses : ఆర్టీసీ బస్సు చక్రం ప్రగతికి చిహ్నాంగా ఒకప్పుడు అందరూ భావించేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ రివర్స్‌ పాలనతో ఆర్టీసీ ఆర్థిక స్థితి గాడితప్పింది. రవాణ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం కష్టాలను రెట్టింపు చేసింది. గుంటూరు జిల్లా పరిధిలో ఐదు డిపోల్లో మెుత్తం 378 బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి రోజుకు లక్షా 40 వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొత్త బస్సులు కొనుగోలు చేయకపోవడం కాలపరిమితి చెల్లిన బస్సులకు పైపై మరమ్మతులు చేసి తిప్పడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటునే ప్రయాణాలు సాగించారు.

ఉచిత బస్సు ప్రయాణంపై అధికారుల కసరత్తు - తెలంగాణ సర్కార్​ అనుసరిస్తున్న విధానమేనా! - Women Free Bus in AP

కాలం చెల్లిన బస్సులు : రాష్ట్రంలోని అతిపెద్ద ఆర్టీసీ డివిజన్లలో ఉమ్మడి గుంటూరు డివిజన్‌ ఒకటి. రాష్ట్రం నలుమూలలకు గుంటూరు నుంచి బస్సులు నడుస్తుంటాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 13, బాపట్ల జిల్లాలో కలిసిన చీరాల, ప్రకాశం జిల్లా అద్దంకి డిపోలతో కలిసి మూడు జిల్లాల్లో మొత్తం 15 డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 1100 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటిలో సుమారు 300 అద్దె బస్సులు ఉన్నాయి. మిగిలిన 800 బస్సుల్లో 300 కాలం తీరినవే! 12 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన బస్సులను నిబంధనల ప్రకారం కాలం తీరినవిగా పరిగణిస్తారు. వాటిని నడపడం డ్రైవర్లకు కష్టమే కాకుండా ఆర్థికంగా కూడా నష్టమే. అటు ప్రయాణికులకు ప్రాణాంతకం. కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనుండటంతో కొత్తబస్సులను తీసుకురావాలని ఆర్టీసీ సిబ్బంది కోరుతున్నారు.

డొక్కు బస్సులతో ప్రయాణికుల ఇక్కట్లు - శిక్ష డ్రైవర్​కా! - RTC Bus Rain Driver

పాత బస్సులకే పైపై మెరుగులు : ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఆర్టీసీ తలరాత మారుతుందని అటు ప్రయాణికులతో పాటు ఇటు ఉద్యోగులు ఆశించారు. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల పరిస్థితి మరింత దిగజారింది. ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్న సమయంలో అధికారులకు కొంత స్వతంత్రత ఉండేది. బస్సుల పరిస్థితి, ప్రయాణికుల డిమాండ్‌ మేరకు ప్రతి ఏటా అవసరాన్ని బట్టి కొత్త బస్సులు కొనడమో, అద్దెకు తీసుకోవడమో జరిగేది. విలీనం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మూడేళ్లుగా ప్రభుత్వం కొత్త బస్సుల ఊసే లేదు. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎట్టకేలకు రాష్ట్రవ్యాప్తంగా 1500 బస్సులు తీసుకున్నారు. అందులో గుంటూరు డిపోకు 30 బస్సులు కేటాయించారని స్థానిక రీజనల్ మేనేజర్ తెలిపారు.

'వైఎస్సార్సీపీ ఘోర ఓటమితో అధికారుల అక్కసు'- కాకినాడలో ఆర్టీసీ ఉద్యోగులపై వేటు - RTC Employees Suspended in Kakinada

గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రహదారుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారి, ఆర్టీసీ బస్సుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఆ రోడ్లపై ప్రయాణించడంతో బస్సులన్నీ షెడ్డు దారి పట్టాయి. దీనికి తోడు గడిచిన రెండేళ్లలో ప్రభుత్వ, అధికార వైఎస్సార్సీపీ కార్యకలాపాలకు ఆర్టీసీ బస్సులను ఇష్టారాజ్యంగా వాడుకోవడం, మరమ్మతులను అటకెక్కించడంతో బస్సుల ఫిట్‌నెస్ దెబ్బతింది. ప్రభుత్వం మారడంతో ఇప్పటికైనా కాలపరిమితి దాటినా పాత బస్సుల స్థానంలో కొత్తవి తీసుకురావాలని ఆర్టీసీ సిబ్బంది కోరుతున్నారు. ఫలితంగా ఆర్టీసీ కష్టాలు కొంతమేర తీరి ఆదాయం కూడా రెట్టింపయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

శిథిలావస్థకు చేరిన బద్వేల్​ బస్టాండ్​ - ప్రజల ప్రాణాలతో ఆర్టీసీ చెలగాటం - Dilapidated RTC Bus Stand

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.