ETV Bharat / state

జగనన్న మున్సిపల్ కాలనీ ముసుగులో మట్టి దందా - ప్రభుత్వం మారినా ఆగని గ్రావెల్‌ తవ్వకాలు - YSRCP Illegal Gravel Mining - YSRCP ILLEGAL GRAVEL MINING

YSRCP Goverment Illegal Gravel Mining in Guntur District : గత ప్రభుత్వ హయాంలో అడిగేవారు లేరని, అడ్డుకునేందుకు ఎవరూ రారని, పర్యవేక్షించాల్సిన వారు పట్టించుకోరని గ్రావెల్​ మాఫియా చెలరేగిపోతోంది. నిరుపేదల సొంతింటి కలను నిర్దాక్షిణ్యంగా చిదిమేసింది. వారి కోసం కేటాయించిన స్థలంలో వైఎస్సార్సీపీ నాయకులు అడ్డగోలుగా మట్టి తవ్వేసి అందినకాడికి దండుకుంది.

illegal_gravel_guntur
illegal_gravel_guntur (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 7:27 PM IST

YSRCP Goverment Illegal Gravel Mining in Guntur District : ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన గ్రావెల్‌ మాఫియా అంతా ఇంతా కాదు. పేదల సొంతింటి కల నిజం చేస్తామంటూ రూ. కోట్లు ఖర్చు చేసి రైతుల భూమిని జగన్ సర్కార్‌ కొనుగోలు చేసింది. గుంటూరు నగర శివార్లలో జగనన్న మున్సిపల్ కాలనీ పేరుతో వేల మంది పేదలకు ఆర్భాటంగా ప్లాట్లు పంపిణీ కూడా చేశారు. అయితే, ఆ స్థలాలను మెరక చేయాల్సింది పోయి కొంతమంది నేతలు కాసులకు కక్కుర్తి పడి ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. ప్రభుత్వం మారినా కూడా ఇంకా గ్రావెల్‌ తవ్వకాలు ఆపకపోవడంతో భారీగా గోతులు ఏర్పడ్డాయి.
సజ్జల కనుసన్నల్లో మైనింగ్‌ మాఫియా - ఒక్కొక్కటిగా బయటపడుతున్న వైసీపీ దౌర్జన్యకాండ - ILLEGAL MINING OF QUARTZ

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇళ్లు లేని పేదల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం శివారు ప్రాంతాల్లో ఇంటి స్థలాలు కేటాయించింది. ఈ స్థలాల కోసం కొర్నెపాడు, పేరేచర్ల తదితర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొని ఇంటి స్థలాలుగా మార్చింది. వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామ పరిధిలో 334 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇందు కోసం ఎకరానికి 46 లక్షల రూపాయల చొప్పున మొత్తం రూ. 153.64 కోట్లు ఖర్చు చేశారు. ఇక్కడ 15 వేల మందికి పైగా నిరుపేదల కోసం ప్లాట్లు కేటాయించారు. అయితే, పట్టాలు ఇచ్చిన స్థలాలను మెరక చేసి పేదలు ఇళ్లు నిర్మించేందుకు అనువుగా చేయాల్సిన తరుణంలో వైఎస్సార్సీపీ నేతలు మట్టి తవ్వకాలు చేపట్టారు. 25 అడుగులకు పైగా లోతులో గుంతలు తవ్వి ఏమాత్రం నివాస యోగ్యం కాకుండా చేస్తున్నారు. సుమారు 5 కోట్ల రూపాయలకు పైగా విలువైన గ్రావెల్ రాత్రివేళలో తరలించి అమ్ముకుంటున్నారు. పైగా స్థలాలన్నీ ఖాళీగా ఉండటంతో పిచ్చిమొక్కలు, కంప చెట్లు పెరిగి చిట్టడవిలా తయారవుతోంది. ఈ ప్రాంతానికి రావాలంటేనే లబ్ధిదారులు భయపడే పరిస్థితి ఏర్పడింది.

ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు వాస్తవమే - సుప్రీంకోర్టుకు పర్యావరణ, అటవీ శాఖ నివేదిక - Supreme Court report illegal mining
అక్రమ తవ్వకాలు అడ్డుకోవాల్సిన యంత్రాంగం మౌనంగా ఉండటంతో జగనన్న మున్సిపల్ కాలనీలో భారీస్థాయిలో గోతులు ఏర్పడ్డాయి. వాటిలో నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా తవ్వకాలు అలాగే జరుగుతున్నాయి. కొందరు బలమైన నాయకులు మట్టి మాఫియాగా ఏర్పడి అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. గుంటూరులోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. పేదల కోసం కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాల భూములను కొందరు నాయకులు అక్రమార్జనకు అనువుగా మార్చుకున్నారు.

నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌పై 275 కేసులు నమోదు - Investigating Quadge Illegal Mining

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.