YSRCP complaint to EC: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారం పై ఎన్నికల అదనపు ప్రధానాధికారిని కలిసి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అదనపు ప్రధానాధికారి కోటేశ్వర రావును కలిసి ఎమ్మెల్యే పేర్ని నాని, మంత్రి మేరుగు నాగార్జున తదితరులు వినతి పత్రం ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు నిబంధనలు సడలింపు పై ఫిర్యాదు చేశామని వారు తెలిపారు.
గొడవలకు దారి తీసే అవకాశం ఉంది: అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పై గతంలో నిబంధనలు జారీ చేశారని, గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలి అని గతంలో చెప్పారని, స్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించమని అంటున్నారని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని నిబంధన ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని వెల్లడించారు. ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందని తెలిపారు. ఈసీ నిబంధనల వల్ల ఓటు గోప్యత ఉండదన్నారు. ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుందన్నారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమలు చేస్తారని ఫిర్యాదు చేశామని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ఈ నిబంధనలను పునః సమీక్ష చేయాలని కోరామన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా సీఈఓ ఆదేశాలు: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అలజడులు సృష్టించారని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నేతలు దాడులు చేస్తే ఎన్నికల కమిషన్, టీడీపీ నేతలు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈసీఐ నిబంధనలని కూడా రాష్ట్రంలో మార్చేస్తున్నారని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఈసీఐ నిబంధనలు విరుద్ధంగా సీఈఓ ఆదేశాలు ఇవ్వడం ఏమిటి అని వైఎస్సార్సీపీ నిలదీశారు. వెంటనే ఆ నిబంధనలను ఉపసంహరించుకోవాలని కోరారు. స్పెసిమెన్ సంతకం ద్వారా ఆమోదించడం సమంజసం కాదన్నారు. పోలింగ్ రోజు టీడీపీ అక్రమాలకు పాల్పడిందని ఆక్షేపించారు. ఇప్పుడు లెక్కింపు సక్రమంగా జరగకూడదు అన్నది టీడీపీ కుట్ర అని ఆరోపించారు.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో నిబంధనలు సడలించటంపై, ఎన్నికల అదనపు ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాం. పోస్టల్ బ్యాలెట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనలను, ఈసీ ఎలా మారుస్తుంది. పోస్టల్ బ్యాలేట్‌పై సదరు ఉద్యోగికి సంబంధించిన వివరాలు, గెజిటెడ్ అధికారి సంతకం.. స్టాంప్ ఉండాలన్న నిబంధినలు ఎందుకు మార్చారన్నారు. ఈ విషయంపై పునరాలోచించుకోవాలని ఎన్నికల అదనపు ప్రధానాధికిరి విజ్ఞప్తి చేశాం. వైఎస్సార్సీపీ నేతలు