YSRCP Attacks on Polling Booths in Joint Anantapur District : శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం హుస్సేన్ పురం పోలింగ్ బూత్‌లో వైఎస్సార్సీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డి వర్గీయులు టీడీపీ నాయకులపై దౌర్జన్యానికి దిగారు. టీడీపీ నాయకులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. వారిని వైఎస్సార్సీపీ నాయకులు కింద పడేసి కొట్టారు. దాడిలో పలువురు టీడీపీ నాయకులు గాయపడ్డారు.
ఒడిసి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు కిషన్ రెడ్డి ఇన్నోవా కారులో పోలింగ్ కేంద్రాన్ని చేరుకున్నారు. కారు వెనక సిద్ధం స్టిక్కర్ అతికించుకుని ప్రచారం చేస్తూ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అధికారులు పట్టించుకోలేదని ప్రజలు వాపోతున్నారు. వైఎస్సార్సీపీ వారికి కోడ్ ఉల్లంఘనలు వర్తించవా అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
తనకల్లు మండలం దేవలం తండాలో ఓపీఓ సరస్వతి తీర్పుకు నిరసనగా పోలింగ్ కేంద్రం ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. ఓటు వేసేందుకు వెళ్లిన వృద్ధురాలిని ఫ్యాన్‌కు వేయాలని ఓపిఓ సూచించడంతో ఆమె ఎదురు తిరిగారు. ఇదే విషయాన్ని గ్రామస్థులు పీవో దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించకపోవడంతో పోలింగ్ కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. వారిని చెదరగొట్టేందుకువచ్చిన పోలీసుల వాహనానికి అడ్డంగా స్థానికులు బైఠాయించారు. ఎన్నికల అధికారులు స్పందించి ఓపిఓ విధులు నుంచి తప్పించడంతో ఆందోళన విరమించారు.
అన్నమయ్యలో వైఎస్సార్సీపీ బరితెగింపు - టీడీపీ ఏజెంట్లపై దాడి, కిడ్నాప్ - YSRCP Leaders Attack
అనంతపురం గుల్జార్ పేట్ కాలనీలో ఉన్న 124 పోలింగ్ బూత్ లో వైఎస్సార్సీపీ మహిళా కార్పొరేటర్ నాగ వినీత దౌర్జన్యంగా కూర్చున్నారు. ఓటెయ్యడానికి వస్తున్న ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వైఎస్సార్సీపీ మహిళా కార్పొరేటర్ నాగవినీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటకు వెళ్లాలని చెప్పారు. బయటికి వెళ్లిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ మళ్లీ దౌర్జన్యంగా పోలింగ్ బూత్‌లోకి వచ్చింది.
మళ్లీ ఎందుకు వచ్చారని దగ్గుపాటి ప్రసాద్ ప్రశ్నించడంతో వైఎస్సార్సీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ బూత్‌లో తమ కౌన్సిలర్ ఉంటుందని వాగ్వాదానికి దిగారు. పోలింగ్ బూత్‌లోనే కూర్చుంటాం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని వైఎస్సార్సీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. దీనిపై 124వ బూత్ పీఓకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఫిర్యాదు చేశారు అయినా పీఓ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్సీపీ మహిళా కార్పొరేటర్ పోలింగ్ బూత్‌లో కూర్చున్నా పీఓ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.
ఉరవకొండలో పోలింగ్ అధికారులతో వైఎస్సార్సీపీ శ్రేణుల వాగ్వాదం - Uravakonda Polling Arrangements