YSRCP Attack On TDP Sarpanch In Satya Sai District : రోజురోజుకీ వైఎస్సార్సీపీ శ్రేణుల ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. భూని, నీటి ప్రజెక్టులు, పంట స్థలాలు, ఎక్కడ చూసినా అధికార పార్టీ నేతలు పాగా వేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ ప్రతిపక్షాలపై దాడులు, అడ్డొచ్చిన వారిపై కేసులు (Case) పెడుతూ అన్యాయంగా అమాయకులను హింసిస్తున్నారు. అదే తరహాలో గ్రామ కంఠం భూమిపై (Land) వీరి కన్ను పడింది. అక్కడున్న చింత చెట్టును కొట్టి ఆ భూమిని చదును చేసుకోవాలని పథకం వేశారు. ఈ క్రమంలో చింత మాను నరకేయడానికి పూనుకున్నారు. ఎవరి అనుమతితో చెట్టు నరుతున్నారని అడిగిన గ్రామ సర్పంచ్‌పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు.
"పెట్రోల్ పోసి తగులబెడతాం - ఈనాడు నిన్ను కాపాడుతుందా?" వైఎస్సార్సీపీ నేతల దారుణం
YSRCP Leaders Attack on TDP : శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు రెచ్చిపోయారు. రొద్దం మండలం కంబాలపల్లి సర్పంచ్‌పైనే దాడికి తెగబడ్డారు. బీదానపల్లి గ్రామ కంఠంలోని చింత చెట్లను కొడుతుండగా అడ్డుకున్న సర్పంచ్ మంజునాథ్‌పై మూక దాడికి తెగబడ్డారు. ఆరుగురు వైఎస్సార్సీపీ (YSRCP) నాయకులు సర్పంచ్‌ను విచక్షణరహితంగా కొట్టారు. గాయపడిన సర్పంచ్‌ను బైక్‌పై ఆస్పత్రికి తరలిస్తుండగా మరోసారి దాడి చేశారు. పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలలో సర్పంచ్ చికిత్స పొందుతున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి (TDP MLA candidate) సవిత వైద్యశాలకు (Hospital) చేరుకుని బాధితుడ్ని పరామర్శించారు. దాడి చేసిన వైఎస్సార్సీపీ మూకలపై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ (Demond) చేశారు.
టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ దాడులు- రోడ్డుపై వాహనాలు అడ్డంగా పెట్టిమరీ రాళ్లు, కర్రలతో తెగబడ్డ వైనం
'పంచాయతీ అనుమతి లేకుండా ఎలా చెట్టు కొడతారు అని అడిగాను. నాపై ఆరుగురు మూకుమ్మడిగా దాడి చేశారు. కర్రలతో కొట్టారు. చెప్పుతో కూడా కొట్టారు. ఉదయం ఆరుగంటలకే చెట్టు కొట్టేస్తున్నారు అని అధికారులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. ఎమ్మార్వో, అటవీ శాఖ వారు కనీసం మా గ్రామం వైపు రాకుండా చేతులు దులుపుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల పరిస్థితులు చేజారిపోయాయి. మందలించిన నాపై వైఎస్సర్సపీ అనుచరలు దాడి చేశారు.' - మంజునాథ్ కంబాలపల్లి, సర్పంచ్
కనీసం ఇప్పుటికైనా పోలీసులు (Police) దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత కోరారు. అధికారుల ప్రోత్సాహంతోనే వైఎస్సార్సీపీ నేతలు రెచ్చిపోతున్నారని ఆవిడ మండిపడ్డారు.