YSRCP Attack On TDP Leaders in Kosta Districts : ప్రశాంతంగా ఎన్నికలు జరిగే కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఈసారి అరాచకం సృష్టించారు. రాళ్లదాడులు, కార్ల అద్దాలు పగులగొట్టి రెచ్చిపోయారు. అటు మంత్రులు సైతం పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి హల్‌చల్ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోలింగ్ పలుచోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. మంత్రి జోగిరమేశ్, తన అనుచరులతో కలిసి పోరంకి జడ్పీ పాఠశాల పోలింగ్ కేంద్రంపై దండయాత్ర చేశారు.
తెలుగుదేశానికి బలమైన ఓటు బ్యాంకు ఉన్న ఈ కేంద్రంలో భయాందోళనలు సృష్టించి పోలింగ్ జరగకుండా చేసేందుకు యత్నించారు. తెలుగుదేశం నాయకులపై రాళ్లు రువ్వి, కట్టెలతో బీభత్సం సృష్టించారు. దాదాపు రెండు గంటల పాటు పోలింగ్‌కు అంతరాయం కలిగించారు. దొంగఓట్లు వేసేందుకు యత్నిస్తున్నవారిని అడ్డుకున్న తెలుగుదేశం బూత్ ఏజెంట్లపైనే దాడి చేశారు. మంత్రి జోగిరమేశ్ స్వయంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి హల్‌చల్ చేశారు.
తెలుగుదేశం అభ్యర్థి బోడెప్రసాద్ అక్కడి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పెనుగంచిప్రోలు మండలం శివాపురంలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. మచిలీపట్నంలోని సర్కార్ తోట పోలింగ్ బూత్ వద్ద తెలుగుదేశం కార్యకర్తలపై వైఎస్సార్సీపీ నేతలకు దాడికి పాల్పడ్డారు. క్షతగాత్రులను కొల్లురవీంద్ర, బాలశౌరి పరామర్శించారు.
Bapatla District : బాపట్ల జిల్లా చీరాలలో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ సరళి పరిశీలనకు వెళ్లివచ్చే క్రమంలో ఇరువర్గాలు ఎదురుపడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కారు అద్దాలను వైఎస్సార్సీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. చీరాలలో టీడీపీ అభ్యర్థి కొండయ్య కుమారుడు మహేంద్రనాథ్ వాహనాన్ని చుట్టుముట్టి దాడికి యత్నించారు. అక్కడి చేరుకున్న కొండయ్య వాహనంపైనా రాళ్లు రువ్వారు. గన్నవరం నియోజకవర్గం తేలప్రోలులో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు కారుపై వైఎస్సార్సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు.
Prakasam District : ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దర్శి నియోజకవర్గం ఎర్రఓబునపల్లె, చౌటపాలెం, బట్లపాలెం పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాము ఓట్లకు డబ్బులు పంచాం కాబట్టి ప్రజలు ఓట్లు తామే వేస్తామంటూ వైఎస్సార్సీపీ ఏజెంట్లు గొడవకు దిగారు. ఎవరి ఓటు వారే వేయాలని కోరిన టీడీపీ ఏజెంట్లపై దాడులకు దిగారు. బట్లపాలెం వద్ద ఇరువర్గాల గొడవను చిత్రీకరిస్తున్న ఈటీవీ విలేకరి వీరనారాయణపై వైఎస్సార్సీపీ మూకలు దాడి చేశారు. కిందపడినా వదలకుండా కొట్టి గాయపరిచారు. ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టారు.
వైఎస్సార్సీపీ నేతల దాడులను నిరసిస్తూ టీడీపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, సోదరుడు గొట్టిపాటి భరత్ నిరసనకు దిగారు. బొట్లపాలెంలో ఏజెంట్లు కుర్చీలతో కొట్టుకున్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని నందిపాలెం పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘర్షణలో తీవ్ర గాయాలపాలైన ముగ్గురు టీడీపీ కార్యకర్తలను పరామర్శించి తిరిగి వస్తున్న టీడీపీ అభ్యర్థి నారాయణరెడ్డి కుమారుడు విఘ్నేశ్‌రెడ్డి వాహనంపై వైఎస్సార్సీపీ వర్గీయులు రాళ్లదాడి చేశారు. నెల్లూరు జిల్లాలో లింగసముద్రం మండలం మొగిలిచర్లలో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు.
వైఎస్సార్సీపీకి షాక్ - తిరగబడ్డ ఓటర్లు - తోకముడిచిన లీడర్లు - AP ELECTIONS 2024 POLLING
West Godavari : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. శ్రీపర్రు, పాలగూడెం, దెందులూరు, సోమవరప్పాడు, కొవ్వలి పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులపై కత్తులు, కర్రలతో విచక్షణారహింగా దాడులకు దిగారు. గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏలూరు నగర శివారు పోణంగి పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ కార్యకర్త వేమూరి నాగరాజు మెడపై కత్తితో దాడి చేయగా తీవ్ర గాయమైంది. కోనసీమ జిల్లా ఆత్రేయపురం పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ నేతలు హల్‌చల్ చేశారు. అడ్డుకోబోయిన తెలుగుదేశం నేతలపై దాడులకు పాల్పడ్డారు.
Uttarandhra : ఉత్తరాంధ్రలోనూ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. నరసన్నపేట మండలం గోపాలపెంటలో తెలుగుదేశం కార్యకర్తలపై వైఎస్సార్సీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. ఆమదాలవలస వైఎస్సార్సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ అనుచరులతో కలిసి పొందూరు మండలం గోకర్ణపల్లి బూత్‌లోకి వెళ్లి అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపించారు. టెక్కలిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అనుమతి లేకపోయినా సెల్‌ఫోన్ మాట్లాడుకుంటూనే పోలింగ్‌బూత్‌లో ఓటు వేయడం వివాదస్పదంగా మారింది. టెక్కలిలో టీడీపీ మద్దతుదారుపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు బ్యాట్‌తో దాడి చేశారు.
Vizianagaram : విజయనగరంలో పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు సెల్‌ఫోన్‌లు తీసుకురావడంపై అభ్యంతరం తెలిపిన తెలుగుదేశం కార్యకర్తలపై దాడికి దిగారు. టీడీపీ సానుభూతిపరుల నివాసాల వద్దకు వచ్చి దాడులు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా తెట్టంగిలో దళితులపై వైఎస్సార్సీపీ నాయకులు కర్రలుస రాళ్లతో దాడికి పాల్పడ్డారు.
బాంబుల మోతతో దద్దరిల్లిన తంగెడ- భయంతో గజగజలాడిన స్థానికులు - YSRCP Activists Bomb Attacks