ETV Bharat / state

ఎదురే లేదనుకున్న కడప జిల్లాలోనూ వైఎస్సార్సీపీకి ముచ్చెమటలు - ys sharmila and sunitha vs jagan

YS Sharmila and Sunitha Vs Jagan in Kadapa: వైఎస్సార్సీపీకి ఎదురే లేదనుకున్న కడప జిల్లాలో వైఎస్ షర్మిల, సునీత ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పక్కలో బల్లెంలా కాకుండా ఏకంగా గొడ్డలిలా మారారు. వివేకా హత్యే ఆయుధంగా ముందుకు సాగుతున్నారు. జగన్‌, ఆయన పరివారంపై ప్రశ్నలు సంధిస్తూ బాణాల్లా వెంటాడుతున్నారు. దీంతో భారతినే ఇంటింటి ప్రచారానికి పంపించాల్సిన పరిస్థితి జగన్​కి వచ్చింది.

YS Sharmila and Sunitha Vs Jagan
YS Sharmila and Sunitha Vs Jagan (ETV BHARAT)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 10:14 AM IST

YS Sharmila and Sunitha Vs Jagan in Kadapa: జగన్‌ ఓ ఊసరవెల్లి, నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే అంటూ షర్మిల విమర్శలు. గొడ్డలి తీసుకుని వారికి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ నరికేయాలి, వారు మాత్రమే ఎన్నికల్లో సింగల్‌ ప్లేయర్‌గా ఉండాలి, ఇదేనా భారతి స్ట్రాటజీ అంటూ ఘాటు వ్యాఖ్యలు. బ్యాండెజ్‌ తీయకపోతే సెప్టిక్‌ అవుతుందంటూ వైఎస్ జగన్​ సునీత గాయంపై వ్యంగ్యాస్త్రాలు. ఇలా ఇలా కడప సిస్టర్స్‌ వైఎస్‌ షర్మిల, సునీతలు ఏకధాటిగా సంధిస్తున్న ప్రశ్నలు జగన్‌కు ఊపిరి సలపనివ్వడం లేదు.

ఆయనకు వారు పక్కలో బల్లెంలా కాదు ఏకంగా గొడ్డలిలా మారారు. ఇన్నాళ్లూ ఎదురేలేదనుకున్న కడప జిల్లాలో ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును ఆయుధంగా మలుచుకుని జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రోజుకో అంశాన్ని ఎత్తుకుని మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ, ప్రచారం చేస్తూ ఇంటింటికీ తిరుగుతూ వణుకు పుట్టిస్తున్నారు. 1996 ఎన్నికల్లో వైఎస్‌ ఎలాగైతే బోటాబొటీ మెజారిటీతో బయటపడ్డారో, ఇప్పుడూ అలాంటి పరిస్థితినే అవినాష్‌రెడ్డికి వారు తీసుకొస్తున్నారు.

న్యాయానికి, నేరానికి జరుగుతున్న పోరాటం - కడపలో గెలిచేది నేనే: షర్మిల - YS Sharmila Interview

ఈ అక్కచెల్లెళ్లు లెవనేత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వారు ఎవరూ లేరు. వైఎస్‌ అవినాష్‌రెడ్డి అడపాదడపా మాట్లాడుతున్నా, వాటిని ఎవరూ నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. చివరికి జగనే రంగంలోకి దిగి పులివెందుల నడిబొడ్డున వైఎస్‌ అవినాష్‌రెడ్డిని చిన్న పిల్లాడు అంటూ చెప్పుకొచ్చారు. అయినా ఆ వ్యాఖ్యలు పనిచేయడం లేదు.

వైఎస్సార్‌ జిల్లాలో ఏ ఊరు, ఏ వీధిలోకి వెళ్లి ఏ గడపను అడిగినా వివేకానందరెడ్డి గొడ్డలి వేటు వేసింది ఎవరంటే కథలు కథలుగా చెబుతారు. పులివెందుల పూలంగళ్ల వద్దకు వెళ్లి చిన్న పిల్లాడిని అడిగినా ఇట్టే చెప్పేస్తాడు. ‘వివేకాను చంపింది ఎవరో వైఎస్సార్‌ కడప జిల్లాలో గడప గడపకూ తెలుసు. ఎవర్ని అడిగినా ఎటువంటి తడబాటు లేకుండా సమాధానం చెబుతారు. ఇక్కడ అదంతా బహిరంగ రహస్యమే’ అంటూ బద్వేలుకు చెందిన ఓ వైఎస్సార్సీపీ నాయకుడు చెప్పడమే దీనికి నిదర్శనం.

కొంగుచాచిన తోబుట్టువులకు ఏం చెప్తావ్ జగన్? - Sisters fire on CM Jagan

పోటీలో బలంగా నిలబడిన షర్మిల: వైఎస్ షర్మిల, సునీత మాట్లాడుతున్న మాటలు జగన్‌ మోహన్ రెడ్డిని పిడుగుల్లా తాకుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటకీ వారు తూటాల్లా సమాధానం ఇస్తున్నారు. గత ఎలక్షన్స్ ముందు పలు హామీలిచ్చి తప్పడంపైనా చీల్చిచెండాడుతున్నారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్న హామీ దగ్గర నుంచి రాయి గాయం వరకూ ఏ విషయాన్నీ ఈ కడప స్టిస్టర్స్ వదలడం లేదు. బోనులో నిల్చోపెట్టినట్లు ప్రశ్నిస్తున్నారు.

ఆమె మాట్లాడే మాటలు జగన్‌ను, ఆయన పరివారాన్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక అవినాష్‌రెడ్డికి అయితే నోట మాట రావడం లేదు. సమర్థించుకునే పరిస్థితి సైతం లేదు. ఎదురుదాడి అస్సలు చేయడం లేదు. అండగా యంత్రాంగం లేకపోయినా, పార్టీ బలం లేకపోయినా షర్మిలకు తన గళమే బలంగా మారింది. ఇదే షర్మిలను పోటీలో బలంగా నిలిపింది. 'ఆమె గెలుస్తుందో లేదో అనేది పక్కన పెడితే ఈ విధంగా జగన్‌కు వణుకుపుట్టించిన వాళ్లు మళ్లీ వైఎస్‌ కుటుంబం నుంచే వచ్చారు’ అని పులివెందులకు చెందిన ఓ వ్యక్తి అన్నారు.

జగన్ బంధుత్వాలకు అర్థం తెలుసా? చంపిన వాళ్లు నీ పక్కనే ఉన్నారు- వైఎస్ సునీత - ys viveka murder case

క్రాస్‌ ఓటింగ్‌పై జగన్‌కు గుబులు: జగన్‌ మోహన్ రెడ్డికి షర్మిల, సునీత సంధిస్తున్న ప్రశ్నలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ఇది న్యాయానికి, నేరానికీ మధ్య జరుగుతున్న పోరాటం అంటూ వారు చెప్తున్నారు. పులివెందుల పూలంగళ్ల వేదికగా బహిరంగ సభ నిర్వహించి ఇదే విషయాన్ని చెప్తూ కొంగు చాచి మరీ ఇద్దరు చెల్లెళ్లూ ఓట్లు అడిగారు. ఇది వైఎస్‌ వివేకా అభిమానుల్లో తీవ్రమైన కదలిక తెచ్చింది. ఆయన ద్వారా లబ్ధిపొందిన వారు ఈ జిల్లాలో ప్రతిచోటా ఉన్నారు. చాలా మంది ఇప్పటికే ఎన్నికల్లో షర్మిలకు తమ ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు.

పులివెందుల పట్టణ పరిధిలో ఎక్కువ మంది మహిళల్లోనూ ఇదే అభిప్రాయం వచ్చింది. ‘మా ఇంట్లో 5 ఓట్లున్నాయి. మేమంతా షర్మిలకే ఓటేస్తాం’ అంటూ పులివెందులకు చెందిన ఓ యువకుడు తెలిపాడు. ఇక్కడే కాదు కడప లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పులివెందుల, కడప, బద్వేలు, ప్రొద్దుటూరులో క్రాస్‌ ఓటింగ్‌ జరిగే అవకాశాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ఇదే జగన్‌ మోహన్​రెడ్డికి గుబులు పుట్టిస్తోంది. సునీత పులివెందులలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 1 నుంచి వైఎస్సార్‌ జిల్లాలో రెండో విడత ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఐదేళ్లుగా మాట్లాడకుండా వివేకాపై విద్వేషం ఎందుకు జగనన్నా?: సునీత - Sunita Fire on Jagan

భారతికీ తప్పని నిరసనల బెడద: ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది కడప లోక్‌సభ నియోజకవర్గమే అని చెప్పుకోవాలి. సీఎం సొంత చెల్లెలే ఆయన మీద ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. తండ్రిని కోల్పోయిన బాధితురాలైన సునీత ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఇద్దరి దెబ్బకి జగన్‌ తన సతీమణి భారతిని రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఆమె ఇంటింటి ప్రచారం చేస్తూ అక్కడే ఉంటున్నారు. భారతికి సైతం ప్రజల నుంచి నిరసనలు తప్పడం లేదు. మా పాస్‌పుస్తకంపై జగన్‌ మోహన్ రెడ్డి ఫొటో ఎందుకంటూ ఓ రైతు ప్రశ్నిస్తే ఆమె నోటి వెంట సమాధానమే లేదు. దానికి సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

గొడ్డలితో అందర్నీ నరికేయండి, అప్పుడు మీరే సింగిల్​ ప్లేయర్​- భారతిపై వైఎస్ షర్మిల ఆగ్రహం - YS Sharmila Comments on Avinash

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.