Ys Jagan Mohan Reddy Submit Letters To NCLT : సరస్వతి పవర్ కంపెనీ వాటాలను బోర్డు అక్రమంగా బదలాయించిందంటూ తల్లిని, చెల్లిని కోర్టుకు లాగిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అందులో ఎలాగైనా పైచేయి సాధించాలని అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా చెల్లి షర్మిలతో జరిపిన పలు ఉత్తర ప్రత్యుత్తరాలను ట్రైబ్యునల్ (Tribunal) ముందుంచారు.
చెల్లితో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు : సరస్వతి కంపెనీలో తమ వాటాలను తల్లి విజయమ్మ పేరుతో సరస్వతి పవర్ బోర్డు అక్రమంగా బదలాయించిందని వ్యాఖ్యానించారు. వాటిని రద్దు చేయాలంటూ హైదరాబాద్ (National Company Law Tribunal) వైఎస్ జగన్, ఆయన భార్య భారతీ రెడ్డిలు పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ పిటిషన్‌లో ప్రతివాదులైన షర్మిల, విజయమ్మ, చాగరి జనార్దన్‌రెడ్డి, ఆర్వోసీ, సరస్వతి పవర్ కంపెనీలకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. నోటీసులపై ప్రతివాదులు స్పందించక ముందే చెల్లి షర్మిలతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను జగన్ ట్రైబ్యునల్ ముందు ఉంచారు.
వైఎస్సార్ స్థాపించిన వ్యాపారాలు జగన్ సొంతం కాదు: షర్మిల
వైఎస్ జగన్ షర్మిలకు లేఖ : ఒప్పందం రద్దు చేయడంతో పాటు ఆస్తుల్లో వాటా ఇవ్వకపోతే తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుందని వైఎస్ జగన్ షర్మిలకు సెప్టెంబరు 12న లేఖ రాశారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ "తండ్రి ఉండగానే ఆస్తుల పంపకాలు పూర్తయ్యాయి. ఆయన మరణించి 10 ఏళ్లయింది. పెళ్లయి 20 సంవత్సరాలు అయినప్పటికీ ప్రేమతో ఆస్తుల్లో వాటా ఇద్దామని ఒప్పందం కుదుర్చుకున్నాను. అయితే రాజకీయంగా, వ్యక్తి గతంగా షర్మిల చేసిన ఆరోపణలతో ప్రేమ లేదని తెలిసి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాను’ అని సెప్టెంబరు 17న జగన్ షర్మిలకు రాసిన లేఖలో వివరించారు.
ఎవరి సొమ్ము ఎవరు పంచుకుంటారు? ప్రకృతి సంపద వైఎస్ కుటుంబ ఆస్తా?
రికార్డుల్లోకి తీసుకున్న ట్రైబ్యునల్ : ఈ ఉత్తరాలను రికార్డుల్లోకి పరిగణనలోకి తీసుకోవాలంటూ టైబ్యునల్ల్లో వైఎస్ జగన్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎన్‌సీఎల్‌టీ(NCLT) జ్యుడిషియల్ సభ్యులు రాజీవ్ భరద్వాజ్, సాంకేతిక సభ్యుడు సంజయ్ పూరిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం (అక్టోబర్ 25న) విచారణ చేపట్టింది. జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషన్‌కు అనుబంధంగా లేఖలను సమర్పించామని వాటిని రికార్డుల్లోకి తీసుకోవాలని ట్రైబ్యునల్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన ట్రైబ్యునల్ ధర్మాసనం ఈ లేఖలను రికార్డుల్లోకి తీసుకోవడం వల్ల ప్రతివాదులైన షర్మిల, విజయమ్మ తదితరులకు ఎలాంటి నష్టం లేనందున నోటీసులు జారీ చేయడం లేదని పేర్కొంది. లేఖలను రికార్డుల్లోకి తీసుకుంటూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
MOUపై సంతకం ఎలా చేశారు? అప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? - జగన్‌కు ప్రశ్నలు సంధించిన షర్మిల