ETV Bharat / state

గవర్నర్ చూసీ చూడనట్లుగా పోవద్దని కోరుతున్నా: వైఎస్ జగన్ - ys jagan comments on president rule - YS JAGAN COMMENTS ON PRESIDENT RULE

YS Jagan Comments on President Rule: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ గాడితప్పిందని జగన్‌ అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు. ఇందుకోసం సుప్రీం కోర్టుకు వెళ్తానని పేర్కొన్నారు. గవర్నర్ చూసీ చూడనట్లు వ్యవహరించొద్దని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు తన తీరును మార్చుకోవాలని జగన్ హెచ్చరించారు.

YS Jagan Comments on President Rule
YS Jagan Comments on President Rule (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 6, 2024, 10:01 PM IST

YS Jagan Comments on President Rule: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న దారుణాలను చూసీ చూడకుండా వెళ్లకుండా గవర్నర్ అబ్దుల్ నజీర్ కలుగ జేసుకోవాలని జగన్ కోరారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ వర్గాలు చేస్తోన్న దాడులను, రాష్ట్రంలో పరిస్ధితులను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. రాష్ట్రపతి పాలన కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు సైతం వెళ్లేందుకు సిద్ధమన్నారు.

వెంటనే ఇవన్నీ ఆపాలి: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం నవాబ్‌పేటలో ప్రత్యర్థుల దాడిలో గాయపడి విజయవాడ సన్‌రైజ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావు, డేరంగుల గోపి, దేవిశెట్టి రామకృష్ణలను జగన్ పరామర్శించారు. బెంగళూరు నుంచి నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని, అక్కడ నుంచి ఆసుపత్రికి వెళ్లారు. రాష్ట్రంలో ఒక తప్పుడు సంప్రదాయం మొదలైందని, దానికి చంద్రబాబు నాయుడు తెర తీశారన్న జగన్ ఆరోపించారు.

చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు ఇష్టానుసారం దాడులు చేస్తున్నారన్నారు. దాడులతో ఏమి సాధిస్తున్నారో తెలియడం లేదని జగన్ పేర్కొన్నారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో అదుపు చేయడం కష్టమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా గాడి తప్పిందన్నారు.

ఇది ఇలాగే కొనసాగితే త్వరలో టీడీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తారని హెచ్చరించారు. చంద్రబాబు గ్రాఫ్ చాలా వేగంగా పడిపోతుందన్నారు. చంద్రబాబు పాలనపై ఫోకస్ పెట్టకుండా దాడులు ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఓ సారి ఆలోచించాలని, చెడు సంప్రదాయం కొనసాగితే చాలా నష్టపోతారని జగన్ హెచ్చరించారు. చాలా వేగంగా ఈ ప్రభుత్వం తుడిచి పెట్టుకుపోతుందన్నారు.

జడ్‌ప్లస్‌ ఉన్నా- జగన్‌కు అభద్రతాభావం ఎందుకు?: మంత్రి లోకేశ్‌ - Lokesh tweet on Jagan security

వైఎస్సార్సీపీ హయాంలో అమలైన పలు పథకాలు సహా ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీలను అమలు చేయడంలో చంద్రబాబు వైఫల్యం చెందారని జగన్ విమర్శించారు. చంద్రబాబు గ్రాఫ్ చాలా వేగంగా పడిపోతుందని, పాలనపై ఫోకస్ పెట్టకుండా దాడులు ప్రోత్సహిస్తున్నారని దీన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. దాడులపై అవసరమైతే సుప్రీంకోర్టుకూ వెళతామని, దాడులపై ఇప్పటికే ప్రధాని దృష్టికీ తీసుకెళ్లామన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదని అడుగుతున్నానన్నారు. రాష్ట్రపతి పాలన కోసం జోక్యం చేసుకోవాలని గవర్నర్​ను కోరుతున్నానని వ్యాఖ్యానించారు. గవర్నర్ చూసీ చూడనట్లుగా పోవద్దని కోరుతున్నానన్నారు.

జగన్​కు ఆ విషయం కూడా తెలియదా? : హోంమంత్రి అనిత - Home Minister on Jagan Security

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.