ETV Bharat / state

బాపట్ల జిల్లాలో ప్రేమోన్మాది అఘాయిత్యం - అర్ధరాత్రి యువతి ఇంటికెళ్లి చాకుతో దాడి - MAN ATTACKED A GIRL WITH KNIFE

Man Attacked a Girl with Knife: బాపట్ల జిల్లాలో ప్రేమోన్మాది అఘాయిత్యం - ప్రేమించట్లేదని అర్ధరాత్రి యువతి ఇంటికెళ్లి చాకుతో దాడి

man_attacked_girl_with_knife
man_attacked_girl_with_knife (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2024, 5:34 PM IST

Young Man Attacked a Girl with Knife in Bapatla District: సమాజంలో రోజురోజుకూ ఆడవారిపై అరాచకాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రేమించమని వెంటపడుతూ బెదిరిస్తూ వేధింపులకు గురి చేస్తారు కొందరు. ప్రేమ అంగీకరించకపోతే ఎంతకైనా తెగిస్తున్నారు మరికొందరు. అమ్మాయి దక్కలేదనే కక్షతో పలుమార్లు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆ ఉన్మాదంలో ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. తాజాగా ఇలాంటి ఘటనే బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.

3 గంటలకు ఇంటికెళ్లి గొడవ: జిల్లాలోని చెరుకుపల్లి మండలం కనగాలలో ప్రేమోన్మాది బరితెగించాడు. తన ప్రేమను అంగీకరించడం లేదంటూ బాలిక ఇంటికెళ్లి మరీ చాకుతో దాడికి తెగబడ్డాడు. చెరుకుపల్లిలోని ఓ స్కూల్లో చదువుతున్న బాలిక వెంటపడుతున్న రాజోలు భార్గవరెడ్డి పెళ్లి చేసుకోవాలని కొంతకాలంగా వేధిస్తున్నాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఈ తెల్లవారుజామున 3 గంటలకు ఇంటికెళ్లి గొడవ చేశాడు. వెంట తెచ్చుకున్న చాకుతో బాలికపై దాడి చేశాడు. అడ్డువచ్చిన బాలిక తల్లిదండ్రులనూ దారుణంగా పొడిచాడు. తీవ్ర గాయాలైన ముగ్గురినీ రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో బాలికపై అత్యాచారయత్నం: మద్యం మత్తులో బాలికపై అత్యాచారయత్నం చేశాడు ఓ కీచకుడు. విజయవాడలో సుబ్రమణ్యం అనే వ్యక్తి 13 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో స్థానికులు దసరా బందోబస్తుకు వచ్చిన పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

"భూమి కోసం డెత్ సర్టిఫికెట్​ సృష్టించారు" - కళ్లెదుటే మనిషి ఉన్నా గోడు పట్టని అధికారులు - Woman Complaint in Collectorate

"సినీ నటి కాదంబరి కేసు" - వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు - Kadambari Jethwani Case Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.