AP Election 2024 : రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురుద్ధేశ్యంతో వైసీపీ నేతలు కొత్త నాటకానికి తెరలేపారు. ఇన్నాళ్లు చీరలు, ప్యాంటు, రైస్ కుక్కర్లు ఇలా ఎన్నికల తాయిలాలు పంచిపెడుతూ ఓటర్లను మభ్యపెట్టారు. ఇప్పడు కొత్తగా వారి పార్టీ వాళ్లనే టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వైసీపీ నాయకులు ఒకే వర్గానికి చెందిన వారి మధ్య చిచ్చుపెడుతూ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
YCP Leader Venkatarami Reddy False Election Campaign in Anantapur District : అనంతపురం జిల్లాలో వాల్మీకులపై వైసీపీ నేతలు కుట్రలు బయట పడ్డాయి. పామిడి మండలం నెమళ్లపల్లి గ్రామానికి చెందిన 40 కుటుంబాలు ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలకే మళ్లీ కండువాలు కప్పి పెద్ద ఎత్తున తమ పార్టీలో చేరుతున్నారని ప్రచారం చేసే యత్నం చేశారని స్థానిక ప్రజల ద్వారా విషయం తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ కన్వీనర్ ధనుంజయ, ప్రభాకర్ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. వీరందరిని గుంతకల్లు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. దీంతో వెంకటరామిరెడ్డి కుయుక్తులను తిప్పి కొట్టారు.
"ఇవాళ వైసీపీని వీడి టీడీపీలోకి దాదాపు 100 కుటుంబాలు చేరడం చాలా సంతోషంగా ఉంది. నెమళ్లపల్లి గ్రామంలో వైసీపీ వాళ్లకే కండువాలు కప్పి టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారని చెప్పడం ఎమ్మెల్యే వెంకట రామిరెడ్డికి సిగ్గుచేటు. రానున్న ఎన్నికల టీడీపీ ప్రభంజనం సృష్టించబోతుంది. గుంతకల్లు నియోజక వర్గంలోని ప్రతి గ్రామంలో టీడీపీ నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు " -టీడీపీ నేత గుమ్మనూరు జయరాం
ముస్లిం సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం : టీడీపీ నేత పయ్యావుల కేశవ్ - TDP Leader Payyavula Keshav
TDP Leader Gummanur Jayaram : రాష్ట్రంలోని 5 కోట్ల మందికి మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని గుమ్మనూరు జయరాం వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడానికి రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్రం ప్రగతి బాటలో నడవాలంటే బాబు సీఎం కావాలని పిలుపు నిచ్చారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీ గెలిపించాలని ప్రజలను కోరారు.