YCP Government Not Complete The Vamsadara Project: శ్రీకాకుళం జిల్లాలోని 50 గ్రామాలకు రాకపోకలు సాగించడానికి ఆ వంతెన పూర్తి చేస్తే సరిపోతుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టి 70 శాతం పనులు పూర్తి చేశారు. కానీ ఆ తర్వాత అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మిగిలిన 30 శాతం పనులు మాత్రం ఇప్పటికీ పూర్తి చేయలేకపోయింది. జగన్ సర్కార్ నిర్లక్ష్యంతో 50 గ్రామాల ప్రజలు ఏటికి ఎదురీదాల్సి వస్తోంది. శ్రీకాకుళం- నరసన్నపేట నియోజకవర్గాలను కలిపే హైలెవెల్ వంతెన నిర్మాణం ఆగిపోయి రెండు వైపులా ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఆలోచనకు పదునుపెట్టి - వర్షపు నీటిని ఒడిసిపట్టి - బీడుభూములను సాగుభూములుగా మల్చుకున్న రైతులు
Not Complete Vamsadara project works: శ్రీకాకుళం-నరసన్నపేట నియోజకవర్గాల్లోని 50కిపైగా గ్రామాల ప్రజలు వంశధార నది మీదుగా రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. పోలాకి, గార మండల ప్రజలకు ఇది సులభమైన మార్గం. వంశధార మీదుగా కాకుండా ఈ ప్రాంతాలకు చేరుకోవాలంటే జాతీయ రహదారిపై చుట్టూ తిరిగి 30 కిలోమీటర్ల ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 72 కోట్ల రూపాయల ఎండీఆర్ ప్లాన్ నిధులతో వంతెన నిర్మాణం ప్రారంభించింది. వనిత గ్రామం నుంచి గార వరకు వంశధారపై హైలెవెల్ వంతెన పనులు చకచకా జరిగాయి. తెలుగుదేశం తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు పెండింగ్ పెట్టింది.
ఆ రోడ్డుపై ప్రయాణం - వారంలో రెండుసార్లు షెడ్‌కు వాహనాలు
Bad roads in Rain Season: వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ ప్రజల కష్టాలు వర్ణనాతీతం. నిత్యావసరాలు కొనాలన్నా, రైతులు తమ పంటల్ని అమ్ముకోవాలన్నా చాలా దూరం ప్రయాణించాలి. వరద ఉద్ధృతి తగ్గగానే స్థానికులు నదిలో నుంచే ప్రయాణిస్తూ ఉంటారు. 5 ఏళ్లుగా బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని ఎదురుచూసినా తమకు నిరాశే మిగిలిందని స్థానికులు వాపోతున్నారు. జిల్లాకు వంశధార ప్రాజెక్టు జీవనాధారమని అప్పట్లో ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల ముఖ్య ఇంజినీరు సుగుణాకరరావు అన్నారు. ప్రాజెక్టులో చేపడుతున్న రిప్‌ర్యాప్, హోమోజీనియస్, వంశధార-నాగావళి నదుల అనుసంధానం హైలెవెల్ కాలువ, లింకు, స్పిల్‌వే కాలువలు, హిరమడలం ఎత్తిపోతల పథకం, ఉద్దానం తాగునీటి పథకం, గొట్టాబ్యారేజీ పనులు, వాటి ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. వంతెన పూర్తయితే ఎచ్చెర్ల, వజ్రపు కొత్తూరు, గార, పోలాకి మండలాలకు చేరుకునేందుకు తక్కువ సమయం పడుతోందని స్థానికులు అంటున్నారు. ఈ వంతెనను పూర్తి చేయడం వల్ల పోలాకీ, వనిత మండలాల ప్రజలకు మేలు జరుగుతుంది.