ETV Bharat / state

బాంబుల మోతతో దద్దరిల్లిన తంగెడ- భయంతో గజగజలాడిన స్థానికులు - YSRCP Activists Bomb Attacks - YSRCP ACTIVISTS BOMB ATTACKS

YCP Activists Attack TDP Activists with Bombs in Gurjala Constituency: ఉద్రిక్త పరిస్థితుల పల్నాడు జిల్లాలో పోలింగ్ కొనసాగింది. ఓటర్లను భయపెట్టటమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. గురజాల నియోజకవర్గంలో వైసీపీ రౌడీ మూకలు టీడీపీ కార్యకర్తలపై బాంబు దాడులకు తెగబడ్డారు. తంగెడలో నాటు బాంబులు, పెట్రోల్‌ సీసాలతో పోలింగ్‌ కేంద్రం వద్ద బీతావహ వాతావరణం సృష్టించారు.

ysrcp_activists_bomb_attacks
ysrcp_activists_bomb_attacks (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 9:56 PM IST

Updated : May 13, 2024, 11:05 PM IST

YCP Activists Attack TDP Activists with Bombs in Gurjala Constituency: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వైసీపీ రౌడీ మూకలు బాంబు దాడులకు తెగబడ్డారు. దాచేపల్లి మండలం తంగెడలో నాటు బాంబులు, పెట్రోల్‌ సీసాలతో పోలింగ్‌ కేంద్రం వద్ద బీతావహ వాతావరణం సృష్టించారు. పోలింగ్‌ కాసేపట్లో ముగుస్తుందనగా అక్కడకు చేరుకున్న వైసీపీ శ్రేణులు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. దీన్ని టీడీపీ శ్రేణులు ప్రశ్నించగా ఒక్కసారిగా బాంబులు విసిరారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తతపరిస్థితులు ఏర్పడ్డాయి. క్యూలైన్లలో ఉన్న ఓటర్లతో పాటు టీడీపీ శ్రేణులు కూడా భయంతో పరుగులు తీశారు. బాంబు దాడుల్లో కొన్ని ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. బాంబులు పడిన ప్రాంతానికి సమీపంలో ఉన్న వస్తువులు మంటల్లో కాలిపోయాయి. ఘటన జరిగిన సమయంలో పోలీసులు కూడా అక్కడ లేరు. బాంబు దాడుల విషయం తెలుసుకొని పోలీసు అదనపు బలగాలు సంఘటనా స్థలికి చేరుకున్నాయి. బాంబు దాడులతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.

Last Updated : May 13, 2024, 11:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.