Yanam Jipmer Hospital Inauguration: ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలతో పాటు ఇతర జిల్లాలో దీర్ఘకాలిక, ప్రాణాంతకర వ్యాధులతో బాధపడే రోగులకు అత్యంత ఆధునికమైన వైద్యాన్ని తక్కువ ఖర్చుతోనే అందించేందుకు 50 కోట్ల రూపాయలతో నిర్మించిన జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్మర్) ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆసుపత్రిని నిర్మించింది.
కాకినాడ జిల్లాలో సమీపంలోని కేంద్రపాలిత ప్రాంతం యానం పట్టణంలో నిర్మించిన ఐదంతస్తుల జిప్మర్ (Jawaharlal Institute of Postgraduate Medical Education and Research) ఆసుపత్రిని ఆదివారం మధ్యాహ్నం భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను యానం డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి సిద్ధం చేస్తున్నారు. ఆసుపత్రి భవనాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆసుపత్రి మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
సర్వైకల్ స్పాండిలైటిస్పై పరిశోధన - గుంటూరు వైద్యుడికి అంతర్జాతీయ అవార్డు
గతంలో పుదుచ్చేరి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన యానం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు (Malladi Krishna Rao) కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులను, ఇతర నాయకులను ఒప్పించి నాలుగేళ్ల క్రితం ఈ ఆసుపత్రిని నిర్మించేందుకు కృషి చేశారు. తాజాగా మల్లాడి కృష్ణారావు ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రిలోని సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆదివారం జరిగే ప్రారంభోత్సవానికి పుదుచ్చేరి వ్యవసాయ శాఖ మంత్రి జయ కుమార్ (Puducherry Agriculture Minister Jayanta Kumar)తో కలిసి ఆయన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తక్కువ ఖర్చుతోనే అత్యంత ఆధునికమైన వైద్యం: పుదుచ్చేరిలో భారతదేశంలో ఉత్తమమైన, అత్యాధునిక వైద్యాన్ని అతి తక్కువ ధరలకే అందించే ఆసుపత్రిగా పేరుపొందిన ఆసుపత్రి జిప్మర్ (Jipmer). ప్రస్తుతం ఆ ఆసుపత్రికి అనుసంధానంగా యానం ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. గతంలో పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్మర్)లో రక్త నిధి కేంద్రాన్ని సైతం కేంద్రం ఏర్పాటు చేసింది. అప్పట్లో దానిని కూడా ప్రధాని నరేంద్ర మోదీనే ప్రారంభించారు.
తాజాగా అందరికీ నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో యానాంలో సైతం జిప్మర్ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో అందరికీ జిప్మర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. దీని ద్వారా అనేక మందికి తక్కువ ఖర్చుతోనే వైద్యం అందనుంది. ఆదివారం వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించనున్నారు.
రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్- పిల్లులు, కుక్కల కోసం భారీ ఆస్పత్రి- ప్రత్యేకతలు ఇవే