AP Govt Focus On Irrigation Projects : ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కొద్దిరోజుల క్రితం వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారిపేటలో తాగునీటి సరఫరా చేస్తున్న విధానాన్ని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పరిశీలించారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీర్లతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జల్‌జీవన్ మిషన్‌లో ఇప్పటివరకు చేసిన పనులు, మిగిలిన పనులు సహా పలు విషయాలపై చర్చించారు.
AP Govt Seeks Funds World Bank to Irrigation Projects : వైఎస్సార్సీపీ సర్కార్ రాష్ట్ర వాటా నిధులు సరిగ్గా ఇవ్వకపోవడంతో, జల్‌జీవన్ మిషన్ అమలు సమస్యాత్మకంగా మారింది. 2018 ఆగస్టులో ప్రారంభమైన జేజేఎం కింద ఏపీలో రూ.27,248 కోట్ల అంచనాతో 77,917 పనుల నిర్వహణకు కేంద్రం ఆమోదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం నిధులను సమకూర్చాలన్న ఒప్పందానికి జగన్ సర్కార్ తూట్లుపొడిచింది.
2019-20 నుంచి 2023-24 మధ్య కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.2,254.89 కోట్లు విడుదల చేశారు. రాష్ట్ర వాటా కింద రూ.1630.36 కోట్లు వైఎస్సార్సీపీ సర్కార్ ఇచ్చింది. పనులు చేసిన గుత్తేదారు సంస్థలకు రూ.535.50 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. అదే విధంగా రూ.4,976 కోట్ల అంచనాతో ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) ఆర్థిక సాయంతో చేపట్టిన గ్రామీణ రహదారుల నిర్మాణ పనులకూ ఏపీ ప్రభుత్వ వాటా నిధులను గత సర్కార్ సక్రమంగా విడుదల చేయలేదు.
జల్‌జీవన్ మిషన్ పనులు పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం : మరోవైపు డ్యాంల భద్రతకు కేంద్రం అమలు చేస్తున్న పథకంలో ప్రపంచ బ్యాంకు సాయం ఉంది. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం 70 శాతం నిధులు భరిస్తే, రాష్ట్రం 30 శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 30 శాతం భరించేందుకు ఇన్నాళ్లూ జగన్ సర్కార్ ముందుకు రాలేదు. దీంతో ప్రాజెక్టుల భద్రతకు కేంద్రం ఇచ్చే నిధులను సరిగా ఉపయోగించుకోలేదు. ఈ పరిస్థితుల్లో ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు రుణంతో మొదట జల్‌జీవన్ మిషన్ పనులు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీర్లు పెండింగ్ పనుల పూర్తికి కావాల్సిన నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు.
వైఎస్సార్సీపీ హయాంలో జలజీవన్ మిషన్ అస్తవ్యస్తం - కుళాయి ఉన్న చుక్క నీరందని పరిస్థితి - Jal Jeevan Mission failed at YCP
Jal Jeevan Mission: జల్ జీవన్ మిషన్ పథకం అమలులో ఏపీ విఫలం: గజేంద్ర షెకావత్