Woman Cheating NRI in Visakhapatnam : తీయటి కబుర్లతో ఓ యువతి.. యువకులను ముగ్గులో దింపి అందిన మేరకు డబ్బులు గుంజుతూ మోసాలకు పాల్పడుతున్న ఘటన ఇది. అమెరికాలో పని చేస్తున్న ఒక ఎన్నారై యువకున్ని మాయమాటలతో దగ్గరకు రప్పించుకుని బలవంతంగా నిశ్చితార్థం చేయించుకుని పెళ్లి చేసుకోవాలని తీవ్ర ఒత్తిడికి గురి చేసిన ఉదంతంతో చివరకు పోలీసులకు చిక్కింది. ఇందుకు సంబంధించి భీమిలి సీఐ బి.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం,
Woman Kidnapped NRI in Visakha : విశాఖ మురళీనగర్‌కు చెందిన కొరుప్రోలు జోయ్ జమీనా (25) అనే యువతి అమెరికాలో ఉంటున్న ఎన్నారై మనోహర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. విశాఖలో నివాసముంటున్న యువకుడి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి స్నేహితురాలిని అంటూ పరిచయం చేసుకొంది. రోజుల పాటు మంచిగా నటిస్తూ మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పగా వీరు నిరాకరించారు. దీంతో ఆమె అమెరికా నుంచి యువకుడ్ని రప్పించి విమానాశ్రయం నుంచి నేరుగా మురళీనగర్ ఎన్జీఓ కాలనీలో ఉంటున్న తన ఇంటికి తీసుకుపోయింది. మత్తు పానీయం ఇచ్చి ఇరువురు సన్నిహితంగా ఉంటున్నట్లు ఫొటోలు తీసింది. వాటితో తనను పెళ్లి చేసుకోవాలని బ్లాక్ మెయిల్ చేసింది.
భీమిలిలోని ఓ రెస్టారెంట్లో రూ.5 లక్షలు ఖర్చు చేయించి తన స్నేహితుల సమక్షంలో బలవంతంగా నిశ్చితార్థం చేయించుకుంది. అనంతరం పెళ్లి చేసుకోకపోతే అభ్యంతరకర ఫొటోలను బహిర్గతం చేస్తానని బెదిరిస్తూ వేధింపులకు గురి చేసింది. ఎన్నారై మనోహర్‌ను రోజుల తరబడి ఇంట్లో బంధించింది. ఆమె నుంచి తప్పించుకున్న బాధితుడు ఆమె ఉచ్చు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఈ నెల 4 న భీమిలి స్టేషనులో ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితురాలు నుంచి ల్యాప్టాప్, ఒక ట్యాబ్, మూడు సెల్ఫోన్లు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గతంలోనూ ఇదే తరహాలో పలువురిని మోసగించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధమున్న ఆమె అనుచరులపైనా చర్యలు తీసుకుంటామని సీఐ పేర్కొన్నారు.
Woman Cheat: పెళ్లి చేసుకుని.. నగలు, డబ్బుతో ఉడాయించిన భార్య