Woman Attempted Suicide Due to YCP Leaders Harassment: రాష్ట్రంలో వైసీపీ నాయకులు అధికారం ఉంది కదా అని అరాచకం సృష్టిస్తున్నారు. హత్యలు, భూకబ్జాలు, కిడ్నాప్‌లు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, ఆత్మహత్యలకు పాల్పడేలా వేధింపులు ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ నేరాల్లో చూసినా వైసీపీ నాయకులదే ప్రధానపాత్ర ఉంటోంది. అధికారంతో వారు రెచ్చిపోతున్న ఘటనలు ప్రతిరోజు రాష్ట్రంలో వెలుగు చూస్తునే ఉన్నాయి. తాజాగా అధికార పార్టీ నేతల భూదాహానికి ఏలూరులో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.
దోచుకోవడంలో వాళ్లని మించినోళ్లు లేరు! - అన్నదమ్ముల దెబ్బకు కొండలైనా కదలాల్సిందే
ఏలూరు శ్రీరామ్‌నగర్‌లో నివాసం ఉంటున్న పైడికొండల లక్ష్మి కుమారి అనే మహిళా తనకు చెందిన స్థలాన్ని అధికార పార్టీకి చెందిన నేతలు కబ్జా చేయడానికి ప్రయత్నించడంతోపాటు వారి దౌర్జన్యాలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను బంధువులు చికిత్స నిమిత్తం ఏలూరు ప్రబుత్వాసుపత్రిలో తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఏలూరు టీడీపీ అభ్యర్ధి బడేటి చంటి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి బంధువుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నేతల దాష్టికాల కారణంగా ఎంతోమంది మానసిక వేదనకు గురై ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భూ హక్కులకు మడతపెట్టేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022!
కోర్టుల్లో కేసులు నడుస్తున్నా అధికార పార్టీ నేతలు ఈ విధంగా దౌర్జన్యాలకు పాల్పడుతూ అమాయకులను హింసించడం దారుణమన్నారు. అనంతరం బాధితురాలు కుమార్తె మాట్లాడుతూ శ్రీరామ్‌నగర్‌లోని 11వ రోడ్డులో స్థలం ఉందని, దాన్ని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకునేందుకు ఒక ప్రజాప్రతినిధి సహకారంతో జొన్నకూటి మోహన్‌రావు, దేవానందం, జంగాల రంగారావు, రాజు అనే వారు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. దీనిపై బాధితురాలు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆమె కుమార్తె పేర్కొంది.ఈ ఘటనకు కారకులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'మా చెరువు మిస్సింగ్ - వెతికి పెట్టండి ప్లీజ్' - పోలీసులకు ఫిర్యాదు
మా దగ్గర సైట్ ఉంది. దానికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయి. కొంత మంది వైసీపీ నాయకులు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని మా స్థలాన్ని మా దగ్గర నుంచి స్వాధీనం చేసుకుందామని ప్రయత్నిస్తున్నారు. జొన్నకూటి రామ్మోహనరావు, కడిమంచి రంగారావు, దేవానందం, పచ్చిమెట్ల సత్యనారాయణ వీళ్ల నలుగురు మా స్థలాన్ని మా దగ్గర నుంచి లాక్కుందామని రౌడీలను పంపించారు. వాళ్లు 20 మంది రాడ్లు, కత్తులతో వచ్చారు. మేను భయంతో పోలీసులకు సమాచారం అందించినా పోలీసులు వచ్చి ఏమీ పట్టనట్టే వెళ్లిపోయారు. సంవత్సరం నుంచి పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఒక్కసారి కూడా స్పందించలేదు. మా మీదకు దాడి చేయడానికి వచ్చినప్పుడు భయంతో మా అమ్మ పురుగుల మందు తాగారు. ఆవిడ పరిస్థితి విషమంగా ఉంది.- బాధితురాలు కుమార్తె