Wife Dharna at Husband House in Ponnur : ఆ దంపతులకు రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అతను బీటెక్ చేశాడు. ఆమె ఎంబీఏ చదివింది. ఇరువురూ ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఆ వ్యక్తి వీసాకు అప్లై చేసుకున్నాడు. అది కాస్తా తిరస్కరణకు గురైంది. వెంటనే భార్య చేత దరఖాస్తు చేయగా అది కూడా ఫెయిల్ అయింది. దీంతో ఆమెను పుట్టింటికి పంపాడు. రోజులు గడుస్తున్నా తనని అత్తింటికి తీసుకువెళ్లడం లేదు. ఈ క్రమంలోనే బాధితురాలు భర్త ఇంటి ముందు నిరసన చేపట్టింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆరమండలో చోటుచేసుకుంది.
బాధిత కుటుంబం, స్థానికుల కథనం ప్రకారం మండలంలోని కట్టెంపూడికి చెందిన యువతికి ఆరమండ వాసి యువకుడితో రెండేళ్ల కిందట వివాహమైంది. భర్త బీటెక్ చేయగా భార్య ఎంబీఏ చదివారు. ఉపాధి కోసం ఇరువురూ ఆస్ట్రేలియా వెళ్లటానికి ప్రయత్నం చేశారు. మొగలాయిబాబు వీసా తిరస్కరణకు గురైంది. దీంతో భార్యను పంపి ఆమె ద్వారా డిపెండింగ్ వీసాపై అక్కడకు వెళ్లవచ్చని భర్త ఆలోచన చేశాడు. ఆమెతో దరఖాస్తు చేయించగా తను కూడా అర్హత సాధించలేక పోయింది. దీనితో మూడు నెలల కిందట ఆమెను పుట్టింటికి పంపేశాడు.
న్యాయం కోసం.. భర్త ఇంటి ముందు భార్య ఆందోళన!
Ponnur Woman Protest Husband House : రోజులు గడుస్తున్నా భర్త నుంచి స్పందన లేకపోవడంతో ఆమె గ్రామానికి వచ్చింది ఆదివారం సాయంత్రం అత్తింటి ముందు ధర్నా చేపట్టింది. బాధితురాలికి మద్దతుగా పలువురు స్థానికులు, బంధువులు కూడా కూర్చున్నారు. భర్త కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఫిర్యాదు చేయమని ఆమెను కోరగా తనకు కేసు పెట్టే ఆలోచన లేదని తెలిపింది. న్యాయం జరిగితేచాలని చెప్పటంతో వారు వెనుదిరిగారు. తన భర్త తనను ఇంట్లోకి రానిచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని చెప్పింది. తన అత్త ప్రోద్భలంతోనే ఇదంతా జరుగుతుందని బాధితురాలు ఆరోపిస్తున్నారు. సోమవారం ఆమె నిరసన కొనసాగింది.
భర్త ఇంటి ముందు భార్య మౌన దీక్ష.. పిల్లలతో సహా..
Wife protest for husband : 'మా ఆయన.. నాక్కావాలి' భర్త ఇంటిఎదుట మహిళ పోరాటం..!