ETV Bharat / state

ఏపీకి కొత్త సీఎస్​​ ఎవరు - అధికార వర్గాల్లో జోరుగా చర్చ - ANDHRA PRADESH NEW CS

ఈ నెలాఖరుతో ముగియనున్న ప్రస్తుత సీఎస్‌ నీరభ్​ కుమార్‌ పదవీకాలం

Next CS in AP
Next CS in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 24, 2024, 11:48 AM IST

Next CS in AP : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్​ కుమార్‌ ప్రసాద్‌ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఏడాది జూన్‌ 7న సీఎస్​గా బాధ్యతలు తీసుకున్న ఆయన పదవీకాలం ఆ నెలాఖరుతోనే ముగిసింది. 6 నెలల పాటు సీఎస్‌ పదవి కాలాన్ని పొడిగించాలని ఏపీ సర్కార్ కేంద్రాన్ని కోరడంతో ఆ మేర అనుమతులు వచ్చాయి. మరోసారి ఇంకో ఆరు నెలలు పొడిగించేందుకు అవకాశం ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం నుంచి ఆ దిశగా ప్రయత్నాలేమీ లేకపోవడంతో ఈ నెలాఖరుకు నీరభ్​ కుమార్‌ పదవీ విరమణ చేయడం ఖరారైంది.

ఇప్పుడు కొత్త సీఎస్ ఎవరనేది పరిశీలిస్తే సీనియరిటీ ప్రకారం 8 మంది పేర్లు జాబితాలో ఉన్నాయి. సీనియారిటీ ప్రకారం వివాదాస్పద అధికారిణి శ్రీలక్ష్మీ, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌, ఇతర సర్వీసుల్లో ఉన్న సుమిత దావ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా, విద్యుత్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ ఉన్నారు.

వీరిలో వైఎస్సార్సీపీ అనుకూల అధికారులుగా ముద్రపడిన శ్రీలక్ష్మీ, అజయ్‌ జైన్‌ను సీఎస్‌ ఎంపిక పరిశీలనలోకి ముఖ్యమంత్రి తీసుకోరని తెలుస్తోంది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న సుమిత దావ్రా పేరు పరిశీలనలోకి రాదు. మిగిలిన ఐదుగురిలో పదవీ విరమణకు దగ్గర్లో ఉన్నవారికి సీఎం ప్రాధాన్యం ఇస్తారా? లేక సీనియారిటీ ప్రకారం పదవీకాలం ఎక్కువ ఉన్న వారిని పరిగణలోకి తీసుకుంటారా? అని వేచిచూడాలి.

AP Govt Focus on Next CS : సీనియారిటీ ప్రకారం ఐఏఎస్​ల సర్వీసును పరిశీలిస్తే శ్రీలక్ష్మీ 1988 బ్యాచ్‌కు చెందిన అధికారిణి. ఉన్న వారిలో సీనియర్‌. వైఎస్సార్సీపీకి అత్యంత సన్నిహితురాలిగా ఆమెకి పేరుంది. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లోనూ ఈమెపై అభియోగాలున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక శ్రీలక్ష్మీ నుంచి అభినందనలు స్వీకరించడానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టపడలేదు. శ్రీలక్ష్మీ తర్వాత సీనియర్‌గా ఉన్న అనంత్ రామ్‌ 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్​ అధికారి.

సాయిప్రసాద్‌, ఆర్పీ సిసోదియా, అజయ్‌ జైన్‌, సుమితా దావ్రా 1991 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులు. విజయానంద్‌, బుడితి రాజశేఖర్‌ 1992 బ్యాచ్‌ ఐఏఎస్ అధికారులు. విజయానంద్‌ వచ్చే ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. సాయిప్రసాద్‌ 2026 మే లో, ఆర్పీ సిసోదియా 2028 జనవరిలో రిటైర్మెంట్ కానున్నారు. ఈ లెక్కన ముందుగా పదవీ విరమణ చేసే వారి జాబితాలో విజయానంద్‌ ఉండగా ఆ తర్వాత వరుసలో సాయిప్రసాద్‌, సిసోదియా ఉన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ నిర్ణయాలు పరిశీలిస్తే సీనియారిటీతో సంబంధం లేకుండా ముందుగా పదవీ విరమణ చేసే వారికి అవకాశం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.

పథకాలను వేగవంతం చేయండి - కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టండి: సీఎస్ - AP CS Neerabh Kumar Prasad Review

గంజాయి, డ్రగ్స్​ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం: సీఎస్​ నీరబ్ కుమార్ - Amit Shah on Narcotics Control

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.