Volunteer Cheating Poor People in Nellore District : 'నేను వాలంటీరుగా పని చేస్తూ పొలం కొన్నాను, సొంత ఇల్లు కూడా ఉంది. వ్యాపారం చేయడానికి కాస్తా డబ్బు అప్పుగా ఇవ్వండి' అంటూ చిరు వ్యాపారుల నుంచి గుడి వద్ద అడుక్కునే వృద్ధురాలి వరకు అందరి వద్ద అప్పు చేసింది. వాలంటీరుగా విధులు నిర్వర్తిస్తూ చుట్టు పక్కల వారితో మాటలు కలిపి అందరిని నమ్మించింది. కొంతకాలం వరకు తీసుకున్న డబ్బులకు వడ్డీలు కూడా కట్టింది. తాను మోసం చేయదని నమ్మిన వాళ్లు తమ డబ్బుతో పాటు స్నేహితులతో కూడా అప్పు ఇప్పించారు. చివరికి అందరికి మోసం చేసి కుటుంబ సభ్యులతో సహా పరారయ్యారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకొంది.
ఆ మాయమాటలు నమ్మారో - మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావడం గ్యారెంటీ! - How To Protect From Bank Fraud
నెల్లూరు నగరంలో వాలంటీరుగా పనిచేస్తున్న మోదేపల్లి హేమలత సుమారు 30 మందిని మోసం చేసి కుటుంబంతో సహా పరారయ్యారు. ఆమె అందరితో మంచిగా ఉంటూ ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద వడ్డీలకు నగదు తీసుకున్నారు. చీటీలు వేసి వ్యాపారం చేస్తున్నామని చెప్పారు. సొంతిల్లు ఉండటంతో నిజమేనని అనేక మంది ఆమె మాటలు నమ్మారు. సుమారు 30 మంది వద్ద రూ.60 లక్షలకు పైగా డబ్బులు తీసుకున్నారు.
ఒక వ్యక్తి వద్దే రూ.12 లక్షలు వడ్డీకి తీసుకున్నారు. చిరు వ్యాపారులు, ఇతరుల వద్ద రూ.3 లక్షలు నుంచి రూ.4 లక్షలు వరకు అప్పుగా తీసుకున్నారు. నమ్మకంగా కొద్ది రోజులు వడ్డీ చెల్లించారు. పొదుపు గ్రూపుల్లో ఉన్న సభ్యుల నుంచి మరో రూ.8లక్షలు డబ్బుతో ఉడాయించారు. మొత్తం 10 గ్రూపు సభ్యులు అల్లాడిపోతున్నారు. ఇటీవల ఇంటికి తాళాలు వేసి భర్త పిల్లలతో పరారయ్యారు. డబ్బు ఇచ్చిన వారు ఇంటి చుట్టూ తిరిగి విసిగిపోయారు. ఫోన్లు పని చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'యూ ఆర్ అండర్ డిజిటల్ అరెస్ట్' - అంటే నమ్మకండి! - Cyber Crimes In AP
నా దగ్గర రెండు లక్షల చీటీ వేసింది. మొదటి చీటీనే పాడుకుంది. ఒక్క రూపాయి కూడా కట్టలేదు. ఇంకొకటి రూ.75 వేల చీటీ వేసింది. 10 చీటీలకు గాను 5 చీటీలు మాత్రమే చెల్లించింది. నాకు రూ.2.50 లక్షలు రావాలి. బోండాలు అమ్ముకునే నన్ను మోసం చేసింది_రావమ్మ బాధితులు