Vizag Young Lady Preethi Excelling in Modeling: టీనేజీలోకి అడుగిడుతూనే ప్రీతి పట్నాయక్ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్‌ను గెలుచుకుని ఈ రంగంలో తన అభిరుచికి తగ్గట్టు ఉన్నత శిఖరాలను అందుకునేందుకు గట్టి పునాదినే వేసుకుంది. అన్ని అంశాలపై పట్టు సాధిస్తూనే, మోడలింగ్‌లో తన ప్రతిభను కనబర్చేట్టుగా సాధన చేస్తోంది. ఇందుకు అనుగుణంగా పలు పోటీలకు సిద్ధమవుతోంది. ఇటీవలే కేరళలో జరిగిన 2024 టైటిల్‌ను సాధించడంతో ఆమెలో విశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇటు చదువు, అటు కొరియోగ్రఫీతో పాటు 13 రకాల నృత్యాలు వంటివాటిని ధీటుగా సమన్వయం చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కోసం యత్నాలు చేస్తోంది.
విశాఖకు చెందిన చిన్నారి ప్రీతి పట్నాయక్ ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు అనిత, ప్రసాద్ ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి ఆమెకు ఇష్టమైన నృత్యంలో గురువుల నుంచి మెళకువలను నేర్చుకుని తన అభినయంతో అందరి మన్ననలు పొందుతోంది. ఆన్లైన్లో 13 రకాల డాన్స్‌లలో శిక్షణ పొంది డిప్లమోను అందుకుంది. ఇదే స్ఫూర్తితో పలు పోటీలకు హాజరవుతోంది.
అబ్బురపరిచిన శిలంబం పోటీలు - దేశం నలుమూలల నుంచి పాల్గొన్న ఔత్సాహికులు - Ancient Martial Art Silambam
జిల్లా స్థాయిలో మోడలింగ్, డాన్స్‌లలో పలు కార్యక్రమాల్లో పాలు పంచుకుని బహుమతులను సొంతం చేసుకున్న ప్రీతి పట్నాయక్ ఇందులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కోసం యత్నాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 13న కేరళలో జరిగిన జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ 2024 పోటీలకు హాజరైంది. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మందికి పైగా పోటీ దారులు హాజరయ్యారు. తన ప్రతిభను ప్రీతి అన్ని అంశాలలోనూ ఉత్తమంగా కనబర్చింది.
ఇందులో ఆమె పీకాక్ డాన్స్ అక్కడి ఆహ్వానితులను, జడ్జిలను విశేషంగా ఆకట్టుకుంది. తన విభిన్న దుస్తుల ఎంపిక ద్వారా పోటీదార్ల కంటె మెరుగ్గా తనను తాను ఆవిష్కరించుకుంది. ఈ పోటీలలో అందరికంటే ఉత్తమ ప్రదర్శనను ఇచ్చి ప్రీ టీన్ ఇండియా 2024 టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రకటనలలో ప్రీతిని మోడల్‌గా తీసుకున్నారు. సర్ఫ్ ఎక్సెల్, డిజైనర్స్ షూట్స్, ఓరియో బిస్కట్లు వంట అడ్వర్టైజ్ మెంట్లలో ఈమెకు అవకాశం దక్కింది.
ఈమెకు సొదరుడు కూడా ఉన్నాడు. ప్రీతి ప్రస్తుతం విశాఖ స్టీల్ సిటీ టింపనీలో విద్యాభ్యాసం చేస్తోంది. భవిష్యత్తులో కొరియోగ్రఫీ, మోడలింగ్‌లో రాణించాలన్నదే ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. దానిని చేరుకునేందుకు బాగా శ్రమిస్తానని ప్రీతి చెబుతోంది.
"ఈ నెల 13న కేరళలో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ 2024 పోటీలు నిర్వహించారు. అందులో వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మందికిపైగా పాల్గొన్నారు. ఈ పోటీలో నేను ప్రీ టీన్ ఇండియా 2024 టైటిల్‌ను గెలుచుకున్నాను. దీంతోపాటు ఆన్లైన్లో 13 రకాల డాన్స్‌లలో నేను శిక్షణ తీసుకున్నాను. భవిష్యత్తులో కొరియోగ్రఫీ, మోడలింగ్‌లో రాణించాలన్నదే నా లక్ష్యం." - ప్రీతి పట్నాయక్, ప్రిటీన్ ఇండియా 2024 విజేత