NHAI Strict Measures for FASTag Violations: మీ వాహనంపై ఫాస్టాగ్ సరిగా లేదా? అయితే వెంటనే సరి చేసుకోండి. లేదంటే మీపై కఠిన చర్యలు తప్పవు. ఎందుకంటే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి ఫాలో అవ్వని వారికి షాక్ తప్పదు.
టోల్‌గేట్ల వద్ద రద్దీ నియంత్రణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముందు అద్దంపై ‘ఫాస్టాగ్’ను అమర్చని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ వసూలు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. ఫాస్టాగ్‌ను ఉద్దేశపూర్వకంగా విండ్‌స్క్రీన్‌పై అతికించకపోవడం వల్ల టోల్ ప్లాజాల వద్ద చాలా సమయం వృథా అవుతోందని, తద్వారా తోటి వాహనదారులకు అసౌకర్యం కలుగుతోందని అందులో పేర్కొంది.
లేకుంటే ఏమవుతుందంటే:
ఫాస్టాగ్ సరిగా లేని వాహనాలను బ్లాక్ లిస్టులోనూ పెడతామని ఎన్‌హెచ్‌ఏఐ హెచ్చరించింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇతర అద్దాలపై ఫాస్టాగ్‌ను అతికిస్తున్నారని, దీనివల్ల ఇతర వాహనదారులకు ఇబ్బంది కలుగుతోందని పేర్కొంది. ప్రతి వాహనదారుడూ ముందు అద్దంపై బయటకు కనిపించేలా వాహనం లోపలి నుంచి ఫాస్టాగ్‌ను అతికించాలని సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని ఇప్పటికే అన్ని యూజర్ ఫీజు కలెక్షన్ ఏజెన్సీలకు పంపించింది.
పేటీఎం FASTagను డీయాక్టివేట్ చేయాలా? రీఫండ్ కూడా కావాలా? అయితే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!
వాహనదారులను దారిలో పెట్టడమే లక్ష్యంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సరికొత్తగా సంపూర్ణ మార్గదర్శకాలను విడుదల చేసింది.
- ముందు అద్దంపై (విండ్ షీల్డ్‌పై) ఫాస్టాగ్ అతికించకుండా టోల్ దాటే వాహనాలకు విధించే జరిమానాకు సంబంధించిన సమాచారాన్ని టోల్ ప్లాజాల ప్రవేశ మార్గాల్లో ప్రదర్శించాలి.
- విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్ లేకుండా టోల్ లేన్‌లోకి ప్రవేశిస్తే విధించే ఛార్జీలపై ఫీజులతో కూడా బోర్డులు ప్రదర్శించాలని స్పష్టం చేసింది. ఇక ఫాస్టాగ్‌లు లేని వాహనాల వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను సీసీటీవీ ఫుటేజీని రికార్డు చేయాలని సూచించింది. తద్వారా వాహనాలకు సంబంధించిన రికార్డులను నిర్వహించవచ్చునని పేర్కొంది.
- వాహనం లోపల నుంచి ఫాస్టాగ్‌ను అతికించడంపై గతంలో జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయడమే లక్ష్యంగా ఎన్‌హెచ్‌ఏఐ ఈ చర్యలు తీసుకుంటోంది.
- ప్రామాణిక ప్రక్రియ ప్రకారం ఫాస్టాగ్‌లను బిగించుకోకపోతే లావాదేవీల నిర్వహణకు అర్హత ఉండదని స్పష్టం చేసింది. అలాంటి వారు రెట్టింపు టోల్ రుసుమును చెల్లించాల్సి ఉంటుందని, వారిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చవచ్చునని పేర్కొంది.
- ఫాస్టాగ్‌లను జారీ చేసే బ్యాంకులు సైతం వాహనంపై నిర్దేశించిన చోట స్టిక్కర్ అతికించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
- ఈ మేరకు రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలంటూ అన్ని యూజర్ ఫీజు కలెక్షన్ ఏజెన్సీలు, రాయితీదారులకు వివరణాత్మక ‘ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ’ను (ఎస్‌వోపీ) జారీ చేసింది. దీంతో ఫాస్టాగ్‌లను సరిచేసుకోని వాహనదారులు రెట్టింపు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
How to Recharge FASTag With Google Pay: ఇప్పుడు Gpayతో క్షణాల్లో ఫాస్టాగ్ రీఛార్జ్.. ట్రై చేశారా..?