Violation Of Election Code by YSRCP Leaders: ఎన్నికల కోడ్ వెలువడి వారం రోజులు దాటినా క్షేత్రస్థాయిలో ఉల్లంఘనలు తీవ్రస్థాయిలో కనిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాలకు వైఎస్సార్సీపీ నేతలు తిలోదకాలిస‌్తున్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పట్టించుకోవట్లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలక్షన్ కోడ్ వచ్చినా అధికారులు ఇంకా వైఎస్సార్సీపీ సేవలో తరిస్తున్నారని విపక్ష నేతలు ధ్వజమెత్తుతున్నారు.
YSRCP Attack On Person For Entered Details In C vigil App: ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైఎస్సార్సీపీ నేతల కోడ్ ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫిర్యాదు చేసిన వారిపై పలు చోట్ల వైఎస్సార్సీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో వైఎస్సార్సీపీ కార్యాలయానికి రంగులు తొలగించలేదని తెలుగుదేశం కార్యకర్త నాగుల్ భాషా సీ విజిల్ యాప్ (C Vigil app)లో ఫిర్యాదు చేశారు. దీంతో వైఎస్సార్సీపీనేతలు నాగుల్ భాషాపై దాడి చేశారు. వైఎస్సార్సీపీ నేత పోలా పూర్ణతోపాటు మరికొందరు తనని కొట్టారని బాషా తెలిపారు.
సీ-విజిల్లో ఫిర్యాదు - వ్యక్తిపై వైసీపీ నేత దాడి - YCP Attack C Vigil Complaint Person
Bapatla: బాపట్లలోని భీమావారిపాలెం సచివాలయం వాట్సాప్ గ్రూపులో ప్రతిపక్షాల నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై దుష్ప్రచారం చేస్తూ వాలంటీర్లు పోస్టులు పెట్టారు. విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్‌ని టీడీపీకి అంటగడుతూ శనివారం కొన్ని పోస్టులు పెట్టి షేర్ చేశారు. బాపట్ల మండలం కొండబట్లపాలెం వాలంటీరు వాట్సాప్ గ్రూపులో వైఎస్సార్సీపీకి అనుకూలంగా వీడియోలు పెట్టి ప్రచారం చేస్తూ దొరికిపోయాడు. ఎన్నికల కోడ్ అమలు చేయాలని కోరినందుకు కొల్లూరు మండలం కిష్కింధపాలెంకు చెందిన కూటమి సానుభూతిపరుడు కొల్లి వెంకటేశ్వరరావుపై వైఎస్సార్సీపీ నేతలు చేశారు. తెలుగుదేశం, జనసేన జెండాలు తొలగించి వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు, జెండాలు ఎందుకు వదిలేశారని వెంకటేశ్వరరావు అధికారులను నిలదీశారు. దీంతో ఎంపీటీసీ (MPTC), సర్పంచ్ మరో ఇద్దరు కార్యకర్తలు తనపై దాడి చేశారని వెంకటేశ్వరరావు తెలిపారు.
టీడీపీ సర్పంచ్‌పై వైఎస్సార్సీపీ నేతల దాడి
Prakasam: ఎన్నికల కోడ్ వచ్చి వారం రోజులు దాటినా ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పెదవులగల్లులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైఎస్సార్సీపీ రంగులు తొలగించలేదు. మరోవైపు ఆరోగ్య కేంద్రానికి ఉన్న వైఎస్ఆర్ పేరు కనపడకుండా రంగు వేయడం, పేపర్ అంటించకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుని సాక్షిగా కోడ్ ఉల్లంఘన సాగుతోంది. రెండేళ్ల క్రితం ఆలయ పునర్నిర్మాణ సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేల చిత్రాలతో రూపొందించిన పుస్తకాలను భక్తులకు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల సమాచారంతో పుస్తకాలు పంపిణీ చేయకూడదన్న నిబంధనలను ఆలయ అధికారులు తుంగలో తొక్కడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం రాసినేపల్లిలో కదిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి మక్బూల్ అహ్మద్‌తో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నలుగురు వాలంటీర్లపై వేటు పడింది. ఇదిలా ఉండగా మక్బూల్ వాలంటీర్లను ప్రలోభ పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు భయపడకుండా రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే తిరిగి నియమిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో అందర్నీ తీసుకొచ్చి ఓటేయించి వైఎస్సార్సీపీను గెలిపించాలని కోరారు. దీంతో వైఎస్సార్సీపీ నేత ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.