Villagers Hunt For Diamonds in Vajrakarur : వర్షాకాలం మొదలైందంటే చాలు అన్నదాతలు ఆకాశం వైపు చూస్తారు. చినుకు పడితే చాలు రైతన్నల ఆనందానికి అవధులు ఉండవు. పొలం సాగుచేసి పంటలు వేస్తారు. ఇది దేశంలో ఎక్కడైన జరిగే సర్వసాధరణమైన విషయం కానీ అనంతపురం జిల్లాలో మాత్రం రైతన్నలతో పాటు వ్యవసాయంతో సంబంధం లేని వారు వరుణ దేవుడి రాక కోసం ప్రార్థనలు చేస్తుంటారు. జిల్లా వాసులు ఏమైన ప్రేమ విత్తనాలు వేశారా అని అనుకుంటున్నారా? కాదండీ బాబు ఆ ఒక్క వానతో లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోవాలని వారి ఆశ. అదేంటో చూద్దాం పదండీ.
కొండగుట్టల్లో దాగిన అదృష్టం! - జీవితం మారిపోయేందుకు ఒక్క రోజు చాలంట
Diamonds Hunt in Vajrakarur Anantapur district : అక్కడ వర్షాలు పడితే చాలు చిన్నా పెద్దా ఆడ మగ తేడా లేకుండా వేట మొదలుపెడతారు. అది మామూలు వేట కాదు. వజ్రాల వేట. అవునండీ ప్రస్తుతం అనంతపురం జిల్లా వజ్రకరూరులో అందరూ ఈ వేటలోనే నిమగ్నమైపోయారు. వర్షం తమకు అదృష్టం తీసుకొస్తుందా లేదా అని ఆశగా చూస్తుంటారు. వర్షాలు పడి భూమిపై ఉన్న వజ్రాలు బయట పడతాయని ఏటా వర్షాకాలంలో వజ్రకరూరుతో పాటు చుట్టుపక్కల ప్రజలు పొలాల్ల అన్వేషణ ప్రారంభించారు. ఒక్క వజ్రం దొరికినా జన్మ ధన్యమే అనుకుంటూ ఉద్యోగులు సైతం సెలవులు పెట్టుకొని మరీ పొలాల్లో వెతుకులాట ప్రారంభిస్తారంటే అతిశయోక్తి కాదు. తమ అదృష్టం పరీక్షించుకోవటం కోసం కుటుంబంతో సహా వచ్చి వెతికే వారు కొందరైతే ఏకంగా పొలాలకు భోజనం క్యారేజీలతో వచ్చే వారు కొందరు. సెలవులు కావటంతో వజ్రకరూరు కళకళలాడుతోంది. ఒక్క వజ్ర దొరికినా సమస్త కష్టాలు తీరుతాయనే నమ్మకంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ ప్రాంతాల వారు వజ్రాల కోసం వెతకుతూనే ఉన్నారు.
Search for diamonds in Nallamala Forest : వక్కిలేరు వాగులో...వజ్రాలకోసం వెతుకులాట...
ఒక్క వజ్రం దొరికినా చాలు తమ జీవితాల్లో మార్పు వస్తుందనే ఆశతో తవ్వకాలు చేస్తున్నారు. ఆరేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్లు దాటిన వృద్ధులు కూడా ఈ వెతుకులాటలో కనిపిస్తారు. మరికొందరు ఇంటిల్లిపాది విహారయాత్రకు వచ్చినట్లు వచ్చి రంగురాళ్లు అన్వేషిస్తుంటారు. చంటిపిల్లల్ని వెంటేసుకుని వచ్చి వారికి ఊయల కట్టి జోలపాడి నిద్రపుచ్చి ఆ తర్వాత వజ్రాల కోసం వెతికేవారు కూడా ఉన్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు కూడా వజ్రాలు వెతికే పనిలో నిమగ్నమయ్యారు. ఒక్క వజ్రం దొరికితే చాలు జీవితం ధన్యమవుతుందని భావించి ఉద్యోగస్థులు సైతం సెలవు పెట్టి మరీ వెతుకులాట ప్రారంభించారు. ఒక్క వజ్రం దొరికినా జీవితం మారుతుందనే ఆశతో అనంతపురంలోని ప్రజలు వజ్రాల వేట సాగిస్తున్నారు. ఖరీదైన వజ్రం కాకపోయినా రంగురాళ్లు దొరికినానాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చనే ఆలోచనతో మరికొందరు అదృష్టం వెతుక్కుంటున్నారు. వారి అదృష్టం ఎలా ఉందో మరీ ఈసారీ!