ETV Bharat / state

పన్నుల పెంపుతో ప్రజల్ని పీల్చిపిప్పి చేసిన జగన్‌- గుర్తు చేసుకుంటున్న బెజవాడ వాసులు - Vijayawada People hopeful TDP Govt - VIJAYAWADA PEOPLE HOPEFUL TDP GOVT

Vijayawada People Suffered Under YSRCP Government: వైఎస్సార్సీపీ తమ ఉపాధి అవకాశాలను దెబ్బకొట్టి చెత్తపన్ను వసూలు, ఏటా ఆస్తి పన్ను పెంపు వంటి విధానాలతో తమను పీల్చిపిప్పి చేసిందని బెజవాడ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపుని అదుపు చేయాలని గత ఐదేళ్లలో ప్రజలు గళమెత్తినా జగన్ సర్కార్ కనికరించలేదని విమర్శిస్తున్నారు.

Vijayawada People Suffered Under YSRCP Government
Vijayawada People Suffered Under YSRCP Government (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 23, 2024, 3:27 PM IST

Vijayawada People Suffered Under YSRCP Government: ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అస్తవ్యస్త నిర్ణయాలతో విసుగెత్తిపోయిన రాష్ట్ర ప్రజలు కూటమి గెలుపు పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు తమ ఉపాధి అవకాశాలను దెబ్బకొట్టిన జగన్ చెత్తపన్ను వసూలు, ఏటా ఆస్తి పన్ను పెంపు వంటి విధానాలతో తమను పీల్చిపిప్పి చేశారని బెజవాడ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా చెత్తపన్ను మాటున గుదిబండ మోపారని వాపోయారు. అందుకే జగన్ సర్కార్​ను ఇంటికి సాగనంపామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తుందని విజయవాడ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

భయం,బానిసత్వం నుంచి బయటపడ్డామనే భావనలో ఆర్టీసీ ఉద్యోగులు - APSRTC Employees Problems

నిత్యవసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపుని అదుపు చేయాలని గత ఐదేళ్లలో ప్రజలు పెద్ద ఎత్తున గళమెత్తినా జగన్ సర్కార్ కనికరించలేదు. దీనికి తోడు ఎన్నడూ లేని విధంగా చెత్తపన్ను, ఏటా 15శాతం ఆస్తి పన్ను పెంపు నిర్ణయాలతో సామాన్యుల నడ్డి విరిచింది. విద్యుత్ సర్దుబాటు, ట్రూ అప్‌ల పేరుతో విద్యుత్ ఛార్జీలను అదనంగా ముప్పై శాతం వరకు పెంచింది. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ప్రజలు జగన్ సర్కార్​ను ఘోరంగా ఓడించారు.

వైఎస్సార్సీపీని కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేశారు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లోని కార్మికులు, చిరుద్యోగులు చేతినిండా పని లేక వైఎస్సార్సీపీ పాలనలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారు. ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం బూటకపు మాటలతో కాలం వెళ్లదీసిందని ప్రజలు విమర్శించారు.

చిన్నపాటి వర్షానికే మునిగిపోతున్న కడప ఆర్టీసీ గ్యారేజ్‌ - వరద నీటిలోనే మరమ్మతులు - Kadapa RTC Garage Flooded

కూటమి అధికారంలోకి రాగానే చెత్తపన్ను రద్దు చేస్తామని ఎన్డీఏ ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే చెత్తపన్ను వసూలు చేయవద్దని సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే అధికారికంగా చెత్తపన్ను రద్దుపై నిర్ణయం రానుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బెజవాడలో చిన్నపాటి వర్షానికే ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

ప్రధానంగా తాగునీటి సమస్య వేధిస్తోంది. డ్రైనేజీల్లో పూడికలు పేరుకుపోయాయి. వైఎస్సార్సీపీ పాలకులు ఈ సమస్యల్ని పట్టించుకున్న పాపాన పోలేదని నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రజలపై పన్నుల భారం మోపకుండా సుపరిపాలన అందించాలని కోరుతున్నారు.

నిరుద్యోగ ఉపాధ్యాయుల కోసం మరోసారి టెట్ నిర్వహించాలి- మంత్రి నారా లోకేశ్​కు టీడీపీ ఎమ్మెల్సీల వినతి

పన్నుల పెంపుతో ప్రజల్ని పీల్చిపిప్పి చేసిన జగన్‌ - కూటమిపైనే బెజవాడ వాసుల నమ్మకం (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.