Free Sand Transport Irregularities in AP : ఉచిత ఇసుక పాలసీలో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నా కొందరు చెవ్వికెక్కించుకోవంలేదు. దళారులు ఉచిత ఇసుకను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు దారి మళ్లింస్తున్నారనే ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఉచిత ఇసుకను దళారులు అక్రమంగా దారి మళ్లించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉచిత ఇసుక విధానంను దెబ్బతీసే విధంగా ఉన్న అక్రమ రవాణపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టామని విజయవాడ సీపీ రాజశేఖరబాబు తెలిపారు. స్టాక్ యార్డ్, చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేశామని తెలిపారు. టిప్పర్లకు ఏర్పాటు చేసిన జీపీఎస్‌లను కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేశామన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ సిబ్బందికి తగు సూచనలు సలహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తూ ఎక్కడా అక్రమంగా ఇసుక నిల్వ ఉంచకుండా, తరలించకుండా ఉండే విధంగా అధికారులకు సీపీ పలు సూచనలు చేశారు. అనధికారికంగా ఇసుక డంప్‌లను నిల్వ ఉంచిన, అక్రమంగా తరలించిన వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటమని సీపీ స్పష్టంచేశారు.
ఇసుక తవ్వకాల్లో నాడు నేడు ఆయనదే - యథేచ్ఛగా హైదరాబాద్‌కు అక్రమ రవాణా
AP Govt GO On Free Sand Policy : ఉచిత ఇసుక పాలసీలో సీనరేజ్ ఫీజు మాఫీ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా జీవో జారీ చేశారు. ఇసుక పాలసీపై అక్టోబర్ నెల 21న భేటీలో నిర్ణయాలు అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎటువంటి రుసుము చెల్లించకుండా నిర్మాణ అవసరాలకు ఇసుక తీసుకెళ్లేలా ఆదేశాల్లో స్పష్టం చేసింది.
సీనరేజ్ ఫీజు, మెరిట్ ఆన్ శాండ్, డీఎంఎఫ్ మాఫీకి చర్యలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇసుక లభ్యతను పెంచేలా ప్రస్తుత ఇసుక పాలసీలో మార్పులు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక లభ్యం కానీ జిల్లాల్లో స్టాక్ యార్డుల ఏర్పాటు చేయాలని సూచించింది. విజిలెన్స్ మానిటరింగ్‌పై విధివిధానాలు మార్పులు చేసింది. ఇసుక అక్రమంగా తరలి పోకుండా జీపీఎస్, చెక్‌పోస్టుల వద్ద పటిష్ట తనిఖీలకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది.
ఇసుక విధానంపై ప్రభుత్వం కీలక ఆదేశాలు - తవ్వకాలు, లోడింగ్ ప్రైవేటుకు అప్పగించే అవకాశాలు!
ఇసుక అక్రమ రవాణా కట్టడికి జీపీఎస్ - చెక్‌పోస్టుల వద్ద పటిష్ట తనిఖీలు