Vijayasai Reddy Vs Botsa Satyanarayana : విశాఖలోని వాల్తేరు క్లబ్‌పై వైఎస్సార్సీపీ రాజకీయం చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల వేళ ‘అధికారంలోకి రాగానే లాగేసుకుంటాం’ అంటూ విజయసాయిరెడ్డి సవాల్ చేస్తుంటే, ‘నేను, జగన్ ఉండగా అది జరగదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ ఓటర్లను నమ్మించేందుకు తంటాలు పడుతున్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న విజయసాయిరెడ్డి తాజాగా ఓ ఛానల్ ఇంటర్య్వూలో వాల్తేరు క్లబ్‌పై చేసిన వ్యాఖ్యలు విశాఖ వైఎస్సార్సీపీలో చిచ్చురేపాయి.
ఎవరేమన్నారంటే? : వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి. ఈ రోజుకూ నేను అదే చెబుతున్నా. అది ఏ రోజైనా ఒక సామాజికవర్గం చేతిలో ఉండి ఉండొచ్చు. కమ్మ, రెడ్డి, ఇంకే సామాజికవర్గమైనా కావొచ్చు. రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమి. నాకు అధికారం వస్తే ఆ భూమిని తప్పకుండా ప్రభుత్వానికి స్వాధీనం చేస్తా. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలివీ
YSRCP Politics on Valtheru Club : విజయసాయిరెడ్డి ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు. ఏదైనా ఉంటే వన్ టూ వన్ మాట్లాడుకోవాలి. ఇలా బహిరంగంగా మాట్లాడటం తగదు. వాల్తేరు క్లబ్ గురించి మాట్లాడటానికి ఇప్పుడేంటి సందర్భం? ఈ ముఖ్యమంత్రి, నేను ఉండగా అలాంటివి అస్సలు జరగదు. చట్టపరంగా ఏమైనా ఉంటే నగరంలో ఉన్న పెద్దల గౌరవాన్ని తప్పనిసరిగా సీఎం కాపాడతారు. ప్రభుత్వానికి చెందిందే అయితే దరఖాస్తు పెట్టుకుంటారు. దాన్ని జగన్ పరిశీలించి, మిగతా క్లబ్‌ల ప్రకారం ఇచ్చేస్తారు. దీన్ని ప్రత్యేకంగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఏం ఉంది? మేం కూడా ఉన్నాం కాబట్టి పెద్దలదని చెప్పి జగన్‌ను ఒప్పించి చేస్తాం. ఇదీ బొత్స సత్యనారాయణ స్పందన
వాల్తేరు డివిజన్ ఉండాలి.. రాజ్యసభలో విజయసాయిరెడ్డి
AP Elections 2024 : విశాఖలోని వాల్తేరు క్లబ్‌పై వైఎస్సార్సీపీ రాజకీయం చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల వేళ ‘అధికారంలోకి రాగానే లాగేసుకుంటాం’ అంటూ విజయసాయిరెడ్డి సవాల్ చేస్తుంటే, ‘నేను, జగన్ ఉండగా అది జరగదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ ఓటర్లను నమ్మించేందుకు తంటాలు పడుతున్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న విజయసాయిరెడ్డి తాజాగా ఓ ఛానల్ ఇంటర్య్వూలో వాల్తేరు క్లబ్‌పై చేసిన వ్యాఖ్యలు విశాఖ వైఎస్సార్సీపీలో చిచ్చురేపాయి. తన సతీమణి ఝాన్సీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా రేసులో ఉండటంతో మంత్రి బొత్స ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఉత్తరాంధ్రలోని అన్ని సామాజికవర్గాల ప్రముఖులు ఈ క్లబ్‌లో సభ్యులుగా ఉండటంతో ఎక్కడ ఎన్నికలపై ప్రభావం పడుతుందో, ఎక్కడ విజయావకాశాలు దెబ్బతింటాయోనని బొత్స ఆందోళన చెందుతున్నారు.
ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా ఉన్నప్పుడే కన్ను! : వాల్తేరు క్లబ్ సుమారు 20 ఎకరాల్లో విశాఖ నగరం నడిబొడ్డున విస్తరించి ఉంది. బ్రిటీష్ కాలంలో ఏర్పాటయిన ఈ క్లబ్‌లో సభ్యులుగా అన్ని సామాజికవర్గాల ప్రముఖులూ ఉన్నారు. ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా ఉన్నప్పుడే విజయసాయిరెడ్డి ఈ భూములపై కన్నేశారు. ప్రభుత్వ రికార్డుల్లో మిగులు భూమిగా ఉందంటూ గతంలో స్వాధీనం చేసుకునేందుకు హడావుడి చేశారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో స్టే వచ్చింది. ప్రతిపక్షంలో ఉండగా క్లబ్‌లో సభ్యత్వం అడిగితే ఇవ్వలేదన్న అక్కసుతో విజయసాయిరెడ్డి అధికారంలోకి రాగానే కక్షసాధింపునకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయనగరం నుంచి కొందరితో వాల్తేరు క్లబ్‌పై సిట్‌కు ఫిర్యాదు చేయించినట్టు విమర్శలున్నాయి. అందుకే సిట్ పరిధిలో లేని క్లబ్ అంశాన్నీ అందులో చేర్చారు.
ఆ భయంతోనే కౌంటర్ ఇచ్చిన బొత్స : 2014లో వైఎస్ విజయమ్మ విశాఖ ఎంపీ స్థానానికి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేశారు. ఆమెకు మద్దతుగా కొందరు కడప నుంచి వచ్చి వాల్తేరు క్లబ్‌పై దౌర్జన్యాలకు దిగారు. ‘ఈ క్లబ్ ఎలా ఉంటుందో చూస్తాం’ అంటూ హల్‌చల్ చేశారు. దీంతో ప్రశాంతమైన విశాఖలో రౌడీమూకల అల్లర్లపై నగరవాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆ ఎన్నికల్లో విజయమ్మ ఓటమికి కారణాల్లో ఇది కూడా ఒకటని వైఎస్సార్సీపీ భావించింది. ప్రస్తుత ఎన్నికల వేళ వాల్తేరు క్లబ్ వ్యవహారం మళ్లీ తెరపైకి రావడం ఝాన్సీ విజయావకాశాల్ని దెబ్బతీస్తుందేమోననే భయంతో బొత్స వెంటనే దిద్దుబాటుకు దిగారు.
'వాల్తేర్ క్లబ్ సభ్యుడు.. గవర్నర్ స్థాయికి ఎదగడం గర్వకారణం'
'వేల కోట్ల రూపాయల భూకబ్జాలు చేశానంటూ ప్రచారం చేసి నన్ను విశాఖ నుంచి దూరం చేశారు’ అంటూ విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా ఉన్నప్పుడు బొత్స ఓ సామాజికవర్గానికి నేతృత్వం వహించారు. ఈ కారణాలతో ఇప్పుడు బొత్స ఝాన్సీ పోటీలో ఉండగా, వ్యూహాత్మకంగానే సాయిరెడ్డి వాల్తేరు క్లబ్ ప్రస్తావన తెచ్చి, బొత్స కుటుంబానికి వ్యతిరేకంగా పావులు కదిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న బొత్స విజయసాయిరెడ్డికి సంబంధించి సర్క్యూట్‌హౌస్, లులు మాల్‌కు కేటాయించిన స్థలాలు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో రాజకీయాలు, బీచ్ వెంట కబ్జాలు ఇలా అన్ని అంశాలతో చిట్టా సిద్ధం చేస్తున్నారు. ఆ చిట్టాతో తాడేపల్లిలో జగన్ వద్ద పంచాయితీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.