ETV Bharat / state

వెంకయ్యనాయుడిని కలిశాకే నా జీవితం బాగుపడింది: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్​ఖడ్ - Dhankhar About Swarna Bharat Trust - DHANKHAR ABOUT SWARNA BHARAT TRUST

Vice President Jagdeep Dhankhar About Swarna Bharat Trust Services : సహజ వనరులను సరైన విధంగా వినియోగించుకోవాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్​ఖడ్​ పిలుపునిచ్చారు. లేకుంటే భవిష్యత్ తరాలను ప్రమాదంలో నెట్టినట్లవుతుందని చెప్పారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ భారత్​ ట్రస్ట్​ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. స్వర్ణభారత్​ ట్రస్ట్​ ద్వారా ఆపన్నులకు వెంకయ్యనాయుడు అందిస్తున్న సహకారాన్ని ధన్​ఖడ్​ కొనియాడారు.

vice_president_jagdeep_dhankhar_about_swarna_bharat_trust
vice_president_jagdeep_dhankhar_about_swarna_bharat_trust (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 17, 2024, 5:25 PM IST

Vice President Jagdeep Dhankhar About Swarna Bharat Trust Services : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్​ఖడ్​ నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని అక్షర విద్యాలయం స్వర్ణభారత్ ట్రస్ట్ సేవలు పరిశీలించారు. వారు అందిస్తున్న సేవలను చూసి అబ్బురపడ్డారు. యాజమాన్యాన్ని అభినందించారు. చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్న వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్​ను ప్రశంసలతో ముంచెత్తారు. స్వర్ణభారత్ 23 వసంతాల ఉత్సవం అందరి పండుగ అని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కొనియాడారు.

వెంకయ్యనాయుడు‌ ఆలోచనలు, ఆదర్శాలు అనుకరించడం సులభమనిపిస్తుందని, కానీ ఆయనలా వాస్తవ రూపంలో చేసిచూపడం కష్టంమని ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్‌ఖడ్ అన్నారు. అవసరమున్న వాళ్లకు ఆపన్నహస్తం అందించాలనుకోవడం ఎవరైనా ఊహించారా? నేను ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి ఇదే గమనించానని, డ్రాపౌట్లకు చేయూతనిచ్చి వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చారని గుర్తు చేశారు. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదని, భారతీయుల స్వప్నం సాకారమవుతోందని వెళ్లడించారు. ఆయనకు కృతజ్ఞత తెలిపేందుకు నా వద్ద మాటలు లేవని కొనియాడారు. వెంకయ్యనాయుడు‌ వల్ల తనకు విశేషాధికారం వచ్చిందని తెలిపారు.

గ్రామీణ ప్రాతం నుంచి వచ్చిన తనకు ఎవరూ చేయూత నివ్వలేదని గుర్తు చేసుకున్నారు. తాను వెంకయ్యనాయుడిని కలిశాక తన జీవితం బాగుపడిందని అన్నారు. 23ఏళ్ల క్రితం స్వర్ణభారత్ కోసం ఆయన కన్న కల ఇప్పుడు సాకారమవుతోందని తెలిపారు. సహజ వనరుల్ని సరైన విధంగా వినియోగించాలని సూచించారు. మన వద్ద ఉన్న డబ్బు ఆధారంగా పెట్రోలు కొనుగోలు చేయొద్దని, మన ఆవసరాన్ని బట్టి కొనుగోలు చేయ్యాలన్నారు. సహజ వనరులు ఏవైనా. డబ్బే ప్రధానంగా వీటిని ఇష్టం వచ్చినట్లు మనం వినియోగిస్తే భవిష్యత్‌ తరాలను మనం కష్టాల్లో పడేసినట్లు అవుతోందని అన్నారు.

'మన దేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. బాధాకరం ఏంటంటే మన నౌకాశ్రయాల నుంచి ముడి ఇనుము విదేశాలకు ఎగుమతి అవుతోంది. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. ఉపాధి అవకాశాలను దెబ్బతింటున్నాయి. కొంత మంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు. దేశం దీన్ని భరించే పరిస్థితిలో లేదు.'- ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్​ఖడ్

'ఉపరాష్ట్రపతిని పార్లమెంట్​ కాంప్లెక్స్​లో అవమానించడం బాధాకరం'- మిమిక్రీ ఘటనపై మోదీ కౌంటర్

ఎంతో మంది పేద విద్యార్థులు, గృహిణులకు ఉపాధి కల్పించి స్వంత కాళ్లపై నిలబడేలా స్వర్ణ భారతి ట్రస్ట్‌ సేవలందిస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. స్వర్ణ భారతి ట్రస్ట్‌ 23 సంవత్సరాల వేడుకలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు తీసుకోకుండా ఏళ్ల తరబడి సేవలందిస్తోందన్నారు.

స్వర్ణ భారత్ ట్రస్ట్​లో సంక్రాంతి సంబరాలు... హాజరైన వెంకయ్యనాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.