ETV Bharat / state

తేరుకుంటున్న ముంపు ప్రాంతాలు- హైవేపై యథావిధిగా రాకపోకలు - flood relief

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 2:08 PM IST

flood relief: మున్నేరుకు వరద పూర్తిగా తగ్గడంతో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీకీ వరద ఉధృతి వేగంగా తగ్గిపోవడంతో పాటు విజయవాడలోని ముంపు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతల తరఫున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

flood_relief
flood_relief (ETV Bharat)

flood relief: ఎన్టీఆర్ జిల్లా- నందిగామ తెలంగాణ ప్రాంతం నుంచి మున్నేరుకు వచ్చే వరద పూర్తిగా తగ్గుతుంది. ప్రస్తుతం 17000 క్యూసెక్కులు మాత్రమే వరద నీరు వస్తుంది. నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. మున్నేరు వరద హైవేపై ప్రవహించటం వల్ల రోడ్డు మార్జిన్ వరదకు కొట్టుకుపోయింది. వరదకు 13 కార్లు, ఐదు బైకులు, ఒక ఆటో కొట్టుకుపోయాయి. మున్నేరు వరద తగ్గటంతో ఐతవరం వద్ద పొలాల్లో కొట్టుకుపోయిన కార్లు, వాహనాలు బయటపడ్డాయి. ప్రాణ భయంతో కార్లు హైవేపై పెట్టి వెళ్లిన యజమాలు కుటుంబ సభ్యులు వచ్చి వాహనాలు చూసుకొని లబోదిబోమంటున్నారు. వాటిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పొలాల మధ్యలో వరదలో ఉండటం వలన ఇబ్బంది కరంగా మారింది.

హైవేపై వరద ప్రవహించిన ప్రాంతంలో చెత్తాచెదారం పేరుకుపోయింది. దీన్ని హైవే టోల్ ప్లాజా నిర్వాహకులు తొలగిస్తున్నారు. ప్రస్తుతానికి విజయవాడ- హైదరాబాద్ రహదారిపై రాకపోకలు కొనసాగుతూ ఉండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అటు చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామానికి వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. మున్నేరు కృష్ణా నదికి భారీగా వరద నీరు రావడంతో తోటరావులపాడు నుంచి చింతలపాడు వైపు వెళ్లే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆయా గ్రామాల మధ్య వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. దీనివల్ల చింతలపాడు నుంచి తోటరాములపాడు తుర్లపాడు మీదుగా ముప్పాళ్ళ గ్రామం, నందిగామ చందర్లపాడు కు వెళ్లేందుకు ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్ అండ్ బి అధికారులు వెంటనే రహదారికి మరమ్మతు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరతా - కేంద్రానికి లేఖ రాస్తా: సీఎం - CM Chandrababu Naidu on Floods

ప్రకాశం బ్యారేజీకీ వరద ఉధృతి వేగంగా తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం 8.94 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవహిస్తోంది. 11.43 లక్షల నుంచి గంట గంటకు తగ్గుతూ 8.94 లక్షల క్యూసెక్కులకు వరద చేరింది. 18 గంటల్లో రెండున్నర లక్షల వరద తగ్గింది. వరద మరింతగా తగ్గుముఖం పట్టే అవకాశం తెలుస్తోంది.

విజయవాడ ముంపు ప్రాంతాల్లో క్రమంగా వరద తగ్గుతోంది. యనమలకుదురు ప్రాంతంలోని పలు కాలనీల్లో ఇళ్లల్లోకి చేరిన నీరు వెనక్కి వెళ్లింది. దీంతో ఇళ్లల్లోకి ప్రజలు చేరుకున్నారు. ఇళ్లు శుభ్రం చేసుకునే పనుల్లో ప్రజలు నిమగ్నమయ్యారు. పూర్తిస్థాయిలో వరద తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. పునరావాసస కేంద్రాలు, ఎత్తయిన ప్రాంతాల్లో ఉన్న వాళ్లందరికీ ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భోజనం అందజేస్తున్నారు. వరదలో చిక్కుకున్న వాళ్లని పునరావాస కేంద్రాలకు ఎన్ డీ ఆర్ ఎఫ్ సిబ్బంది తో పాటు మత్స్యకారులు తరలించారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ లేక పడుతున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. యనమలకుదురు పెదపులిపాక ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరించేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది.

ఏపీలో వర్ష బీభత్సం - 19 మంది మృతి - ఇద్దరు గల్లంతు: ప్రభుత్వం వెల్లడి - Heavy Rains and Floods in AP

విజయవాడలో హెలికాప్టర్ల ద్వారా వరద ప్రాంతాల్లో ఆహారం పంపిణీ - Food distribution With Helicopters

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.