ETV Bharat / state

ఎన్నికల వేళ జాతీయ రహదారిపై రద్దీ- టీఎస్ఆర్టీసీ 2 వేల ప్రత్యేక బస్సులు - Vehicles Traffic At Panthangi Toll - VEHICLES TRAFFIC AT PANTHANGI TOLL

AP Lok Sabha Election Effect : ఏపీలో ఎన్నికల నేపథ్యంలో చౌటుప్పల్​లోని పంతంగి టోల్​ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్​ జామ్ నెలకొంది. ఓటు వేయడానికి జనం పెద్ద ఎత్తున కదలడంతో మరోవైపు హైదరాబాద్​-విజయవాడ హైవేపైనా వాహనాల రద్దీ నెలకొంది. టోల్​ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. రద్దీ నేపథ్యంలో టీఎస్​ ఆర్టీసీ 2 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

Vehicles Traffic at Panthangi Toll Plaza
Vehicles Traffic at Panthangi Toll Plaza (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 12:28 PM IST

Vehicles Traffic at Panthangi Toll Plaza : ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ఓటర్లు స్వస్థలాలకు తరలి వెళ్తుండటంతో పంతంగి టోల్​ప్లాజా వద్ద విపరీతమైన రద్దీ ఉంది. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్​లో స్థిరపడిన వారంతా, ఓటేసేందుకు ఏపీకి వెళుతుండటంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. ముఖ్యంగా సొంత వాహనాల్లో వెళ్లేవారితో హైదరాబాద్​-విజయవాడ హైవేపై పలుచోట్ల ట్రాఫిక్​జామ్ అవుతోంది.

వీకెండ్​ కావడం, పోలింగ్​కు కేవలం రెండు రోజులే సమయం ఉండటంతో నగర జనాభా ఏపీ వైపు పరుగులు తీస్తోంది. దీంతో భారీ రద్దీ నెలకొంది. పలు చోట్ల నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్నాయి. దీంతో హైదరాబాద్​ శివారు ప్రాంతమైన హయత్​నగర్​ నుంచి అబ్దుల్లాపూర్​మెట్​ వరకు ట్రాఫిక్​ అంతరాయం ఏర్పడుతోంది. చౌటుప్పల్​లోని పంతంగి టోల్​ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. మూడు రోజులు సెలవు దినం కావడంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఈ సాయంత్రం నుంచి వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏపీకి 'ఓటెత్తిన' పౌరులు- రహదారులు కిటకిట - Bus Stands rush with AP voters

ప్రైవేటు ట్రావెల్స్​ 3 రెట్ల ఛార్జీ : ఇదిలా ఉండగా సొంతూళ్లకు వెళ్లే వారికి ప్రయాణం కష్టతరంగా మారింది. ముందుగా బుక్​ చేసుకుందామనుకున్నప్పటికీ అప్పటికే బస్సు టికెట్లు బుక్​ అయి ప్రస్తుతం ఏదో విధంగా వెళ్దామని బస్సులు, రైళ్లు వద్దకు చేరుకుంటున్నారు. కూకట్​పల్లి నుంచి ఆంధ్రప్రదేశ్​లో ఓటుహక్కును వినియోగించుకునేందుకు వెళుతున్న వారికి ఎన్నికల కమిషన్​ రవాణా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బస్సు టికెట్లు సైతం అధిక ధర తీసుకుంటున్నారు. ప్రైవేటు బస్సులైతే ఏకంగా 3 రెట్లు ఎక్కువగా ఛార్జీని వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

రద్దీగా మారిన ఎల్బీనగర్​ బస్టాండ్ : ఓటు వేసేందుకు తమతమ సొంత ఊళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో బస్టాండ్​లు అన్నీ రద్దీగా మారిపోయాయి. ఎల్బీనగర్​లోని విజయవాడ జాతీయ రహదారి బస్టాండ్​ వద్ద ఆర్టీసీ బస్సులు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఏపీలోని జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి నేటి నుంచి మూడు రోజులు సెలవు రావడంతో తమ సొంత ఊళ్లకు వెళుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు. మరిన్ని బస్సులు పెంచితే బాగుంటుందని ప్రయాణికులు కోరుతున్నారు.

ఎన్నికల వేళ జాతీయ రహదారిపై రద్దీ- టీఎస్ఆర్టీసీ 2 వేల ప్రత్యేక బస్సులు (ETV Bharat)

టీఎస్‌ఆర్టీసీ 2 వేల ప్రత్యేక బస్సులు: ఓటు వేసేందుకు నగరవాసులు సొంతూరు బాటపట్టడంతో, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దాదాపు 2 వేల ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అదే విధంగా రైల్వేశాఖ సైతం రెండు రోజులపాటు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. రేపు, ఎల్లుండి సికింద్రాబాద్-విశాఖ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.

తొలిసారి ఓటు వేస్తున్నారా? ఈవీఎంలో ఓటు ఎలా పడుతుందో తెలుసుకోండి! - How To Cast Vote Using EVM

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.