ETV Bharat / state

కూర'గాయాల' నుంచి కోలుకునేదెలా?- నెలరోజులుగా మంటెక్కిస్తున్న ధరలు - VEGETABLE PRICES

Vegetable Prices Sky Rocketing in Kadapa : ప్రతిరోజూ కూరగాయలు కొనాల్సిందే. కూరగాయలు లేనిది ఏ కూర కూడా చేయలేం. మార్కెట్లలో కూరగాయల ధరలు చూస్తే కడుపు మండిపోతుంది. కూరగాయలు కొనాలంటే ముందుగా బోర్డు చూస్తున్నారు. బోర్డులో ఏది తక్కువ ధర ఉంటే అవి కొంటున్నారు. తప్పని పరిస్థితులలో కొనాల్సి వస్తే అతి తక్కువగా కొంటున్నారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 3:58 PM IST

vegetable_prices_sky_rocketing_in_kadapa
vegetable_prices_sky_rocketing_in_kadapa (ETV Bharat)

Vegetable Prices Sky Rocketing in Kadapa : కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఇలా ఉంటే ప్రజలు ఏమి తినాలి, ఎలా బతకాలి ఇక మధ్యతరగతి పేద ప్రజానీకం పరిస్థితి చెప్పనక్కర్లేదు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతోనే పంటలు సరిగా లేవంటూ వ్యాపారులు చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూరగాయల ధరలు పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

Vegetable Price Hike in Andhra Pradesh : పెరిగిన కూరగాయల ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. 500 రూపాయలకు ఐదు రకాల కూరగాయలు కూడా రావడం లేదని కడప ప్రజలు అంటున్నారు. వేసవి ప్రారంభంలో ధరలు సాధారణంగా ఉన్నా నెల రోజుల నుంచి ధరలు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ ధరలతో విక్రయించే రైతు బజారులోనే ఇలాంటి పరిస్థితి ఉంటే బయట మార్కెట్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే కూరగాయల ధరలను తగ్గించి పేద, మధ్యతరగతి ప్రజానీకానికి ఉపశమనం కలిగించాలని వినియోగదారులు కోరుతున్నారు.

కూర'గాయాల' నుంచి కోలుకునేదెలా?- నెలరోజులుగా మంటెక్కిస్తున్న ధరలు (ETV Bharat)

సామాన్యుడా మేలుకో...! కొండెక్కిన ధరలు...ఆహార సంక్షోభం దిశగా దేశం..?

'ఏ కూరగాయలు కొనాలన్నా కిలో 50 రూపాయలు పైమాటే. పచ్చి మిరపకాయలు గత ఎన్నడూ లేని విధంగా కిలో వంద రూపాయల చొప్పున ఉంది. బయట చిన్నచిన్న దుకాణాలు కిలో 160 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. టమాటాలు కిలో 40 రూపాయలు, బెండ 45, బీరకాయలు 60 రూపాయలు, కాకరకాయలు 70, మట్టి కాయలు 40, బంగాళాదుంప 50, క్యాబేజీ 40, బీన్స్ 75, దొండకాయ 50, కొత్తిమీర కట్ట 50, అల్లం 180 రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు. వారానికి కనీసం వెయ్యి రూపాయలు చొప్పున కూరగాయలకే విక్రయించాల్సి వస్తుంది. ప్రభుత్వం తక్షణం కూరగాయల ధరలపై ఏదో ఒక నిర్ణయం తీసుకొని ధరలను తగ్గించి పేద మధ్యతరగతి ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.' - వినియోగదారులు

Vegetable Price Hiked: అమాంతంగా పెరిగిన ధరలతో.. అందని ద్రాక్షలా కూరగాయలు..

ప్రభుత్వం స్పందించి పెరిగిన కూరగాయల ధరలను తగ్గించి పేద ప్రజలకు అందుబాటులోకి ధరలు తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వాపోతున్నారు.

Tomato Prices మోత మోగిస్తున్న టమోటా ధరలు.. మదనపల్లి మార్కెట్లో కిలో రూ.80

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.