Art of Foreign Birds in Guntur District: గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు పక్షుల ఆవాస కేంద్రంలో విదేశీ పక్షుల సందడి మొదలైంది. మధ్య ఆసియా, సైబీరియా, తూర్పు యూరప్ వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అడవి, వైడర్ జాతి పక్షులు ఈ ఉప్పలపాడుకు వస్తాయి. కొన్ని విదేశీ దేశాల్లో మంచు గడ్డ కట్టే ఈ సమయంలో అవి ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించి మరీ ఉప్పలపాడు విడిది కేంద్రానికి వస్తాయి. ఇవి ఈ ప్రాంతంలో గుడ్లు పెట్టి పిల్లలను వృద్ధి చేసి వాటికి ఎగరడం నేర్పిస్తాయి. ఇది వినడానికి ఎంతో అతిశయోక్తిగా ఉంది కదూ కానీ ఇదే నిజం.
విద్యార్థులూ నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే!
విదేశీ పక్షుల విడిది కేంద్రం: 1980లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా బాపట్లలో పని చేసిన మృత్యుంజయరావు అనే వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు విదేశీ పక్షులను గుర్తించారు. గ్రామ రైతుల సహకారంతో ఎనిమిదెకరాల చెరువును అభివృద్ధి చేసి ఇందులో పక్షులు గుడ్లు పెట్టేందుకు అంతే కాకుండా సంతానానికి అనువుగా స్టాండ్లు ఏర్పాటు చేయించారు. ఉప్పలపాడు దగ్గర అనుకూలమైన వాతావరణ పరిస్థితుల వల్ల దాదాపు 27 రకాల పక్షులు ఇక్కడే విడిది చేస్తాయి. పక్షులకు అరుదైన ఒక ప్రత్యేక అవాస కేంద్రంగా దీన్ని గుర్తించారు. అటవీ, పర్యాటక శాఖలు సంయుక్తంగా 2002లో టవర్, రైలింగును ఏర్పాటుచేశారు. అప్పట్లోనే టీడీపీ ప్రభుత్వం రూ.3 కోట్లు వెచ్చించి విదేశీ పక్షుల విడిది కేంద్రాన్ని తీర్చిదిద్దింది.
Migratory birds dead: పెలికాన్ పక్షులకు ఏమైంది..! మృత్యువాతకు కారణం ఏంటి?
కెన్యా రైతులకు కష్టాలు.. 60లక్షల పక్షుల్ని చంపుతున్న ప్రభుత్వం.. ప్రత్యేక బడ్జెట్ సైతం..