ETV Bharat / state

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు - ROAD ACCIDENTS IN AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 11 minutes ago

Two People Died at Road Accident in Bapatla District : బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును అశోక్ లేలాండ్ వాహనం ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి, నంద్యాల జిల్లాల్లో మరో రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

Two people died at road accident in Bapatla district
Two people died at road accident in Bapatla district (ETV Bharat)

Two People Died at Road Accident in Bapatla District : బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును అశోక్ లేలాండ్ వాహనం ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రేపల్లె మండలంలోని పెనుమూడి వారధిపై చోటుచేసుకుంది. రేపల్లె నుంచి మచిలీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సును అదే సమయంలో అవనిగడ్డ వైపు నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం ఒక్కసారిగా ఢీ కొట్టడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షత గాత్రులను అవనిగడ్డ, రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. మృతులు శ్యాం, గంగాధర్​, క్షతగాత్రులంతా మండలంలోని పెద అరవపల్లి గ్రామస్థులుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

కారు ఢీకొట్టడంతో విద్యార్థి మృతి : తిరుపతిలో దారుణం జరిగింది. గూడూరు పట్టణంలోని క్రీడా మైదానంలో వంశీ అనే యువకుడు కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో అదుపుతప్పి విద్యార్థి పైకి దూసుకెళ్లింది. కారు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన విద్యార్థి లీలా విక్షత్ (11) చికిత్స పొందుతూ మృతి చెందాడు. విక్షత్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కారు నడిపి ప్రమాదానికి కారణమైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

టాటా ఎలక్ట్రానిక్స్ గోదాములో అగ్నిప్రమాదం- భారీగా ఎగసిపడిన మంటలు - Fire Accident at Tata PLANT

బైకును తప్పించబోయి బోల్తా పడి బొలెరో : నంద్యాల జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డోన్ సమీపంలోని నగరవనం వద్ద ఓ బొలెరో వాహనం బైకును తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ స్థానికుల సాయంతో 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరంతా జార్ఖండ్​కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - నలుగురు యువకుల దుర్మరణం - ROAD ACCIDENT

చిన్నారికి అనారోగ్యం - అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన సీఎం చంద్రబాబు - CM Chandrababu Help To Child

Last Updated : 11 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.