ETV Bharat / state

అధిక వడ్డీ ఆశచూపి కోట్లలో వసూలు చేసి ఉడాయింపు - లబోదిబోమంటున్న బాధితులు - Two Crore Fraud In Satya Sai

Two Crore Scam in Sathya Sai District : దొంగతనాలు, ఆన్లైన్​ మోసాలు, వర్తకం పేరుతో, వడ్డీలు ఇస్తామని ఇలా తోచిన రీతిలో సామాన్యులను దోచుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా ఈ తరహా మోసం సత్యసాయి జిల్లాలో జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ ఆన్​లైన్ మోసం వెలుగు చూసింది.

two_crore_scam_in_sathya_sai_districtt
two_crore_scam_in_sathya_sai_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 2:51 PM IST

Updated : Aug 30, 2024, 3:53 PM IST

Two Crore Fraud In Satya Sai District : తాళాలు వేసి ఉన్న ఇళ్లే తన టార్గెట్​ అంటాడో గజ దొంగ. రోడ్డుపై ఒంటరిగా వెళ్లున్న మహిళ మెడలోని గొలుసుకు టెండరేస్తాడో చోరుడు. బస్టాప్​లలో, రైల్వే స్టేషన్​లలో కాపుకాస్తాడో కేటుగాటు. ఇలా దొంగతనాలకు, లూటీలకు ఎవరికి తోచిన విధానాన్ని వాళ్లు అనుసరిస్తారు. వీటికి ఆన్​లైన్​ మోసాలు తోడయ్యాయి. వడ్డీల పేరుతో గ్రామస్థులను వలలో వేసుకున్న వ్యక్తి మోసం తనకల్లులో చోటు చేసుకుంది.

Two Crore Scam in Sathya Sai District : శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు, నల్లచెరువు పోలీస్ స్టేషన్ల పరిధిలో వేరువేరు కేసుల్లో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్పల మండలానికి చెందిన చిన్న ఓబులేసు మహేశ్వర్ రెడ్డిగా పేరు మార్చుకుని నల్లచెరువు మండలంలో కోట్లల్లో కుచ్చుటోపీ పెట్టాడు. తక్కువ ధరకే చక్కెర, సిగరెట్లు ఇప్పిస్తానంటూ చిన్న ఓబులేసు 2 కోట్ల 36 లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించాడు. అధిక వడ్డీ పేరుతో గ్రామస్థుల నుంచి కోట్లల్లో వసూలు చేసి నల్లచెరువు నుంచి ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు చిన్న ఓబులేసుని అతనికి సహకరించిన శివ, శీను అనే మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

తనకల్లు మండలంలో మోహన్ రాజు, అరుణ్ కుమార్ , నాగరాజు అనే ముగ్గురు నిందితులు యువకులకు ఉద్యోగాల పేరుతో వల వేశారు. గ్రామీణ యువజన వికాస్ బ్యాంక్​లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఐదుగురి నుంచి 6 లక్షల 50 వేల రూపాయలు వసూలు చేశారు. డబ్బులు తీసుకుని ఏడాది కావస్తున్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

4 కోట్లకు పైగా అప్పులు వసూలు- రాత్రికిరాత్రే ఇంటిని ఖాళీ చేసి పరార్​- లబోదిబోమంటున్న బాధితులు - Merchant cheating and excaped

Online Fraud in Krishna District : ఇదిలా ఉండగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆన్​లైన్​ మోసాలు వెలుగు చూశాయి. వందలాది మంది బాధితుల నుంచి కేటుగాళ్లు కోట్లల్లో వసూళ్లు చేశారు. వెయ్యి కడితే 90 రోజుల్లోనే రూ. 1400 ఇస్తామంటూ ప్రచారం చేశారు. 5 వేల రూపాయలు కట్టిన వాళ్లకి తొలుత సరైన సమయానికే డబ్బు చెల్లించారు. ఒకరిని చూసి ఒకరు యాప్​లో సభ్యులుగా చేరారు. అత్యాశకు పోయిన ప్రజలు పది వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు కట్టారు. డబ్బులు వెనక్కి రాకపోవడం యాప్ నిర్వాహకులు స్పందించకపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. మూడు రోజుల నుంచి వాట్సప్ గ్రూపు, ఇతర గ్రూపులను యాప్ నిర్వాహకులు తొలగించారు. మోసపోయామంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

5 వందలకు 7 లక్షలు- రండి బాబు రండి! స్కీమ్ వెనుక స్కామ్ గుర్తించక లబోదిబో - Protest on Money Scheme Fraud

Last Updated : Aug 30, 2024, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.