ETV Bharat / state

ఆనంద నిలయం స్వర్ణమయం పథకాన్ని పునఃప్రారంభించనున్న టీటీడీ

ఆనంద నిలయం స్వర్ణమయం పథకం పునఃప్రారంభం - విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు విశేషంగా ఇవ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయం

AANANDA NILAYAM SCHEME IN TTD
AANANDA NILAYAM SWARNAMAYAM SCHEME REINTRODUCE BY TTD (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 12 hours ago

AANANDA NILAYAM SWARNAMAYAM REINTRODUCE BY TTD: ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు టీటీడీ సిద్దమవుతోంది. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు మాత్రమే వీఐపీ బ్రేక్ లో దర్శన అవకాశం ఇవ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2008లో టీటీడీ సంకల్పించిన ఈ పథకాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేసింది. అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చన అనంతర దర్శనం కల్పిస్తున్నారు. ప్రస్తుతం అర్చనానంతర దర్శన సేవ లేకపోవడంతో ప్రస్తుత ధర్మకర్తల మండలి ఈ పథక దాతలకు ప్రత్యామ్నాయంగా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అర్చనానంతర దర్శనానికి బదులుగా గరిష్టంగా 5 మంది కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 3 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తారు. రూ.2,500/- టారిఫ్‌లో సంవత్సరానికి 3 రోజులు వసతి కల్పిస్తారు.సంవత్సరానికి ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదంగా అందిజేస్తారు. దాతల దర్శన సమయంలో సంవత్సరానికి ఒకసారి బహుమానంగా ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ బహుమానంగా అందజేస్తారు. దాతలకు మొదటిసారి దర్శన సమయంలో 5 గ్రాముల బంగారు డాలరును, 50-గ్రాముల వెండి నాణెంను బహుమానంగా అందిస్తారు.

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - 10 రోజుల పాటు ఈ దర్శనాలు రద్దు

ఇకపై ఆ టికెట్లు రద్దు - రెండు గంటల్లోనే శ్రీవారి సర్వదర్శనం - టీటీడీ సంచలన నిర్ణయాలు

'ఈటీవీ' కార్తిక దీపోత్సవం - వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.