TTD set up Boards Explaining Rules for Visiting Tirumala: మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో అన్యమతస్థుల శ్రీవారి దర్శన నిబంధనలు వివరిస్తూ తిరుమలలో టీటీడీ బోర్డులు ఏర్పాటు చేసింది. దర్శనానికి వెళ్లాలంటే తప్పక పాటించాల్సిన, అనుసరించాల్సిన విధానాలను వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఏటీసీ సర్కిల్, గోకులం గెస్ట్ హౌస్ వద్ద బోర్డులను ప్రదర్శనకు ఉంచారు. ఎండోమెంట్ చట్టం మేరకు అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. డిక్లరేషన్ ఫారాలు అదనపు ఈఓ కార్యాలయం, వైకుంఠం కాంప్లెక్స్, రిసెప్షన్, అన్ని ఉప విచారణాధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని బోర్డుల ద్వారా తెలియచేశారు.
డిక్లరేషన్ పత్రంపై సంతకం పెట్టాలని డిమాండ్: జగన్ తిరుమలకు వస్తే దేవాదాయశాఖ తిరుమల శ్రీవారిపై విశ్వాసం ఉందంటూ డిక్లరేషన్ పత్రంపై సంతకం పెట్టాలని కూటమి నేతలు, హైందవ సంఘాలు పట్టుబట్టాయి. సంతకం పెట్టిన తర్వాతనే శ్రీవారిని దర్శించుకోవాలంటూ ఆందోళనలు తీవ్రం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్థులు పాటించాల్సిన నిబంధనలు, అనుసరించాల్సిన సంప్రదాయాల వివరాలతో తిరుమలలో తితిదే బోర్డులు ఏర్పాటు చేసింది. హైందవేతరులు ఆలయం ప్రవేశం చేయాలంటే తప్పనిసరిగా డిక్లరేషన్ పై సంతకం పెట్టాలన్న నిబంధనలను సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు.
తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణకు సిట్ - 9 సభ్యులతో టీమ్ ఏర్పాటు - SIT on Tirumala Laddu Adulteration