ETV Bharat / state

రేబిస్​ వ్యాక్సిన్లు కావాలా? అయితే 15400 నంబర్​కు కాల్​ చేయండి

2030 నాటికి రేబిస్‌ను నిర్మూలించాలనే లక్ష్యంగా కేంద్రం చర్యలు

Rabies Vaccines Troll Free Number
Rabies Vaccines Troll Free Number (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2024, 9:15 AM IST

Rabies Vaccines Troll Free Number : కుక్క, పాము కాటుల‌కు గురైన వారికి స‌త్వర చికిత్స అందించే చ‌ర్యల్లో భాగంగా స‌మాచారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా హెల్ప్​లైన్​ను ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన 15400 టోల్ ఫ్రీ నంబ‌ర్​కు బాధితులు సంప్రదిస్తే కుక్క కాటుకు వ్యాక్సిన్లు ఎక్కడ ల‌భ్యమ‌వుతాయో వెంట‌నే స‌మాధానం చెబుతారని తెలిపింది. ఉద‌యం 9 గంటల నుంచి సాయంత్రం ఆరు గంట‌ల మ‌ధ్య ఈ కేంద్రం ప‌నిచేస్తుందని పేర్కొంది. ప్రస్తుతానికి ఆంగ్లం, హిందీ భాష‌ల్లో స‌మాధానం ఇస్తారని సర్కార్​ వివరించింది. సోమ‌వారం నుంచి తెలుగులోనూ స‌మాధానం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశామని వెల్లడించింది.

పాము, కుక్క కాట్ల మ‌ర‌ణాల్ని త‌గ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ హెల్ప్​లైన్​ను ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రానికి అనుసంధానంగా విజ‌య‌వాడ‌లో దీనిని ఏర్పాటు చేశారు. 2030 నాటికి కుక్క కాటు వ‌ల్ల వ‌చ్చే రేబిస్​ వ్యాధిని నిర్మూలించాల‌న్న ల‌క్ష్యాన్ని సాధించేందుకు అనుగుణంగా ఇది దోహదపడనుంది. మనుషుల్లో నమోదైన రేబిస్‌ కేసులు 99 శాతం కుక్కతోనే వ్యాప్తి చెందింది. రేబిస్​ వ్యాధితో ఏడాదికి 20,000ల మంది వ‌ర‌కు మ‌రణిస్తున్నారు. 2023లో దేశవ్యాప్తంగా 30.43 లక్షల కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. అదే ఏపీలో 2023లో 2,12,246 మంది కుక్క కాటుకు గుర‌య్యారు.

Rabies Vaccines Troll Free Number
పోస్టర్లు, క‌ర‌ప‌త్రాల్ని ఆవిష్కరిస్తున్న వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి కృష్ణబాబు (ETV Bharat)

Helpline Number to Dog and Snake Victim : నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్‌(ఎన్‌సీడీసీ), యునైటెడ్ నేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ ఫండ్‌(యుఎన్‌డీపీ)తో క‌లిసి కేంద్ర ప్రభుత్వం ఈ కాల్ ​సెంట‌ర్​ను ఆంధ్రప్రదేశ్​తో పాటు మ‌ధ్యప్రదేశ్‌, దిల్లీ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ప్రారంభంచింది. స‌మీప ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటు, పాము కాటుకు వ్యాక్సిన్ల ల‌భ్యత‌తో పాటు ముంద‌స్తు జాగ్రత్త చ‌ర్యలు, స‌మాచారం, అవ‌గాహ‌న క‌ల్పించాల‌నే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజ‌ల్లో ఆవ‌గాహ‌న క‌ల్పించేందుకు తెలుగులో ముద్రించిన పోస్టర్లు, క‌ర‌ప‌త్రాల్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పాము కాటుకు ఏటా 50వేల మంది బలి- కాటు వేయగానే ఏం జరుగుతుందంటే! - SNAKE BITE TREATMENT

డేంజర్ డాగ్స్ - ఆడుకుంటున్న బాలుడిపై అటాక్ - తల పీక్కుతిన్న కుక్కలు - SECUNDERABAD BOY DIED IN DOG ATTACK

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.