Tribal Women Innovative Protest for Roads on Womens Day : ప్రపంచ మహిళా దినోత్సవం రోజున గిరిజన మహిళలు తాము పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. మహిళలకు పురిటి నొప్పులు వచ్చినప్పుడు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు దారి లెేకపోవటం వల్ల వారు పడే ఆవేదనను ప్రపంచానికి తెలియజేశారు. ఇదంతా మహిళలకు ఎంతో చేశాం, అని గొప్పలు చెప్పే పాలకులకు కనువిప్పు కలిగించేలా మహిళా దినోత్సవాన్ని వేదికగా చేసుకుని నిరసన తెలిపారు. తమ సమస్యలను అందరికీ తెలియచెప్పే ప్రయత్నం చేశారు.
చందమామను అందుకున్నా - 'అక్కడ' బిడ్డను కనాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే!
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీలోని జగడాలమాడి, తెంగిళ్ల బంధ, సీమ రాయి గ్రామాల్లో 60 కుటుంబాలు వరకు ఆదివాసీ గిరిజనులు నివాసముంటున్నారు. ఈ గ్రామాలకు రోడ్లు నిర్మిస్తామని 2020లోనే అధికారులు పనులు ప్రారంభించారు. కానీ నేటికి పూర్తి కాలేదు. దీంతో కేటాయించిన రూ. 5 కోట్ల నిధులను దోచేశారని మహిళలు ఆరోపించారు. దీనికి నిరసనగా ప్రపంచ మహిళా దినోత్సవం రోజున గిరిజన మహిళలంతా డోలి మోస్తూ ఆందోళన తెలిపారు. నాలుగేళ్లు పూర్తవుతున్నా రహదారి పనులు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు ఇప్పటికి పూర్తి కాలేదని ఆరోపించారు.
Tribal Womens Protest in Womens day at Alluri District : అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై రోడ్డు కోసం కేటాయించిన నిధులను మింగేశారని స్థానికులు చెబుతున్నారు. పనులు మెుదలు పెట్టి మధ్యలో వదిలేశారని మండిపడ్డారు. పనులు ప్రారంభించి నేటికీ నాలుగు సంవత్సరాలు అవుతున్నా ఏటువంటి లాభం లేదని వాపోయారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఈ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయని విమర్శించారు. ఈ పరిస్థితుల వల్ల గర్భిణీలు ప్రసవ సమయంలో ఇదే డోలీ పద్ధతిలో మోసుకుని దిగువున ఉన్న ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సి వస్తుందని వాపోయారు.
గిరిజన మహిళలపై అటవీశాఖ సిబ్బంది దాష్టీకం.. నలుగురి పరిస్థితి విషమం
ఈ విధానం వల్ల తల్లి, బిడ్డ ఒత్తిడికి లోనై ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఏజెన్సీలోని మారుమూల గ్రామాల ఆదివాసీ గిరిజన మహిళలు తమ సమస్యలను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు. డోలీ కట్టుకుని వారే మోసుకుంటూ తమ నిరసనను తెలియజేశారు. ప్రధానంగా ఆదివాసీ మహిళలను కాపాడేందుకైనా రోడ్డు సౌకర్యం కల్పించాలని వారంతా కోరుతున్నారు. ప్రపంచం అభివృద్థి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రంలో మాత్రం గ్రామాలను రోడ్డులేని పరిస్థితి నెలకొందని గిరిజన మహిళలు ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని మహిళలు కోరుతున్నారు.