Tidco Houses Distribution Problems in Nellore District : నెల్లూరులోని అల్లిపురం వద్ద టిడ్కో గృహాల ప్రారంభోత్సవం రసాభాసగా ముగిసింది. మంత్రులు ఆదిమూలపు సురేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇళ్లను ప్రారంభించారు. ఇంటి తాళాలు అప్పగిస్తారని భారీగా లబ్ధిదారులు తరలివచ్చారు. సమావేశం అనంతరం మంత్రులు ఇద్దరికీ మాత్రమే ఇంటి తాళాలు అందజేసి వెళ్లిపోవడంతో, లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. పనులు మానుకొని వస్తే ఇద్దరికి మాత్రమే ఇచ్చి వెళ్లిపోవడం ఏమిటని సభా వేదిక ముందు లబ్ధిదారులు ప్రశ్నించారు. ఇంటి అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సభా వేదిక వద్దే ఓ వ్యక్తి జగనన్న ఇచ్చిన ఇంటి పట్టాను చించేశారు. తమకు ఇళ్లు ఎప్పుడిస్తారంటూ లబ్దిదారులు అధికారులను చుట్టుముట్టడంతో వారు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.
టిడ్కో ఇళ్లు అప్పగించకుండా జగన్ మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడు: జేసీ ప్రభాకర్ రెడ్డి
People Problems For House : నెల్లూరులో (Nellore) 15 వేలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తున్నామని ప్రారంభోత్సవ సభలో మంత్రులు తెలిపారు. మరో ఆరు వేల ఇళ్లు రెండు నెలల్లో పూర్తి చేసి అందిస్తామని చెప్పిన మంత్రులు ఇద్దరికీ మాత్రమే ఇంటి తాళాలు అందజేసి వెళ్లిపోవడంతో, లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kakani at Tidco Opening in Nellore : పనులు మానుకొని తాము ఇంటి తాళాల కోసం వస్తే ఇవ్వకుండా వెళ్లిపోవడం ఏమిటని సభా వేదిక ముందు ప్రశ్నించారు. అద్దెలు కట్టుకోలేక తాము ఇబ్బందులు పడుతున్నామని, ఎప్పుడో పూర్తయిన ఇళ్లను కూడా ఇంకా ఇవ్వకపోవడం ఏమిటని నిలదీశారు. సభా వేదిక వద్దే ఓ వ్యక్తి జగనన్న ఇచ్చిన ఇంటి పట్టాను చించేయగా, ఓ వృద్ధురాలు కన్నీటితో తన ఆవేదనను వ్యక్తం చేసింది. తమకు ఇల్లు ఎప్పుడిస్తారంటూ లబ్దిదారులు అధికారులను చుట్టుముట్టడంతో వారు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెనుతిరిగారు.
చెప్పుకోడానికి ఒక్క పనీ చేయలేదు గానీ చంద్రబాబుపై విమర్శలా - టీడీపీ నేతలు ఏం చేశారంటే!
'మేము పనులకు వెళ్లకుండా, తిండీ, నీళ్లు లేకుండా ఇంతసేపు సభలో ఉన్నాం. ఇళ్ల తాళాల ఆశ చూపి మమ్మల్ని మోసం చేశారు. ఇలా చెయ్యడం మొదటి సారి కూడా కాదు. రోజూ పనికి వెళ్తే గానీ పూట గడవని మాతో ఎందుకు ఆడుకుంటున్నారు. ఒక పెద్దావిడ సభకు రావడాని డబ్బులు కూడా అడుక్కుని వచ్చింది. ఇప్పుడు తిరుగు ప్రయాణానికి చార్జీలకు పది రూపాయలు కూడా లేవని కంటతడి పెట్టుకుంటున్నా అధికారులు తప్పించుకుని తిరుగుతున్నారు.' - టిడ్కో గృహాల లబ్దిదారులు
టిడ్కో ఇళ్లపై జగన్ నిర్లక్ష్యం - లబ్దిదారులకు శాపంగా మారిన ప్రభుత్వ అలసత్వం
అధికారుల నిర్లక్ష్యం వీడాలని, వెంటనే తమకు ఇళ్లు ఇవ్వాలని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధుల మొండి వైఖరిపై జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు.