ETV Bharat / state

పులులు, అటవీ జంతువుల మధ్య ప్రయాణం - నల్లమల అడవిలో 13 కిలోమీటర్ల రైడ్‌ - Thummalabailu Jungle Safari

Thummalabailu Jungle Safari Attracting: అడవిలో ప్రయాణమంటే అదో మధురానుభూతి, వన్యప్రాణుల అడుగుజాడలు, అరుదైన పక్షులు, వేలాది రకాల వృక్ష జాతులను వీక్షిస్తూ చల్లని వాతావరణంలో ప్రయాణం మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని తుమ్మలబైలు జంగిల్‌ సఫారీ రైడ్ పర్యాటకులకు మానసిక ఉల్లాసంతో పాటు జీవితకాల జ్ఞాపకాలను మిగిల్చుతోంది.

Thummalabailu Jungle Safari Attracting Tourists
Thummalabailu Jungle Safari Attracting Tourists (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 8:50 AM IST

Updated : Aug 5, 2024, 4:51 PM IST

Thummalabailu Jungle Safari Attracting Tourists : ప్రకాశం జిల్లా డోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో నల్లమల అటవీ ప్రాంతంలో తుమ్మలబైలు జంగిల్‌ సఫారీ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. శ్రీశైలం వెళ్లి వచ్చే వారు ఇక్కడకు వచ్చి తప్పనిసరిగా సఫారీలో తిరగాల్సిందే. 2016లో ఏర్పాటు చేసిన ఈ సఫారీలో దాదాపు 13 కిలోమీటర్లలో ప్రకాశం, నంద్యాల జిల్లాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతాన్ని చుట్టు ముట్టే విధంగా వాహనంతో రైడ్‌ నిర్వహిస్తారు.

Somasila Drone Visuals: నల్లమల అటవీలో అద్భుత పర్యటక ప్రాంతాలు

అడవిలో దాదాపు 1500 రకాలు వృక్ష జాతులు : వన్య ప్రాణులు తిరిగే ఈ ప్రాంతంలో వ్యాన్‌ నుంచి అడవిని వీక్షిస్తూ, గైడ్‌ చెప్పే విషయాలు వింటూ ఆస్వాదించవచ్చు. ఒక్కోసారి పులులు కూడా కనిపిస్తుంటాయి. తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్న పులులు చెట్లపై వేసిన పంజా గుర్తులు, అడుగు జాడలు కనిపిస్తుంటాయి. వివిధ రకాల పక్షులు కూడా ఇక్కడ నిత్యం తిరుగుతూ ఆనందపరుస్తాయి. ఈ అడవిలో దాదాపు 1500 రకాలు వృక్ష జాతులు ఉన్నాయి. జంతువుల జాడ తెలుసుకోడానికి అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరాలు, జంతువుల కోసం తాగు నీటి ఏర్పాట్లు కూడా ఈ రైడ్‌లో పర్యాటకులు చూసి ఆనందం వ్యక్తం చేస్తుంటారు.

ఫ్లవర్స్ వ్యాలీ... భూమిపై ఉన్న స్వర్గలోకం!

అవగాహన కార్యక్రమం : తుమ్మలబైలు జంగిల్‌ సఫారిలో పర్యటన అనంతరం మ్యూజియం కూడా చూడొచ్చు. వివిధ రకాల జంతువుల కొమ్ములు, కళేబరాలు ఇక్కడ భద్రపరిచారు. అటవీ జంతువుల అరుపులు, వాటి ప్రవర్తనను అవగాహన కల్పించేందుకు వీడియో, ఆడియో ప్రదర్శన కూడా ఉంటుంది. ఇవన్నీ చూసిన పర్యాటకులకు విఙ్ఞానాన్ని అందిస్తుంది. ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఈ సఫారీ రైడ్ నిర్వహిస్తారు.

"పర్యాటకులను తుమ్మలబైలు జంగిల్‌ సఫారీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సఫారీ ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు అడవుల సంరక్షణ గురించి తెలియజేయడమే. పర్యాటకులకు అడవుల సంరక్షణ, వన్యప్రాణులను కాపాడుకోవడం గురించి వివరిస్తాం. 13 కిలోమీటర్ల ట్రాక్ ద్వారా సందర్శకులను తీసుకెళ్లి నల్లమల అడవి గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాం. వారికి వినోదంతో పాటు విజ్ఞానం అందిస్తాం. ప్రజలకు అడవులు, వన్యప్రాణుల ప్రాముఖ్యతను వివరిస్తాం."- విశ్వేశ్వరరావు, రేంజ్‌ అధికారి

హైదరాబాద్‌ వాసులకు దగ్గర్లోని అద్భుత పర్యాటక ప్రాంతాలు - అక్కడికి వెళ్లారంటే ప్రకృతిలో పిల్లలైపోతారు! - Best Tourist Places Near Hyderabad

Last Updated : Aug 5, 2024, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.