Pet Dog Theft in Telangana: పెంపుడు జంతువులను పెద్దపెద్ద సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు చాలా మంది ప్రేమగా పెంచుకుంటారు. వారికి ఎంత పని ఉన్నా వాటికి కొంత సమయం కేటాయిస్తుంటారు. ఈ జాబితాలో కుక్కలది ప్రత్యేక స్థానం. మూగ జీవాలలో అత్యంత విశ్వాసమైన జంతువుల్లో కుక్కకే మొదటి ప్రాధాన్యం. అందుకే కుక్కలను ప్రేమతో పెంచుకుంటారు. కొంతమంది అయితే పెంపుడు కుక్కలను ఇంట్లో మనిషిలా చూస్తుంటారు. అలాంటి పెంపుడు కుక్కలకు బయట మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే అదే రీతిలో వీటిని దొంగలించే వారు ఉన్నారు. డబ్బుల కోసం బయట అమ్ముకునేందుకు కొందరు, పెంచుకునేందుకు మరికొందరు ఇలా చోరీలకు పాల్పడుతుంటారు.
వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. హచ్ బ్రీడ్‌కు చెందిన పెంపుడు కుక్క చోరీకి గురైంది. శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న అప్పరి నారాయణ అనే వ్యక్తి ఇంట్లో ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కుక్కను శనివారం(నవంబర్ 2)న గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి దొంగిలించారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై వెళ్తుండగా, ఇంటి ముందు ఆడుకుంటున్న హచ్ కుక్కను చూసి దానిని ఎత్తుకెళ్లిపోయారు.
"చెన్నై ఎక్స్‌ప్రెస్ మర్డర్ స్టోరీ" - తండ్రీ, కూతురు కలిసి మృతదేహాన్ని ముక్కలు కోసి!
ఈ గ్యాంగ్‌లో ఓ యువతి కూడా ఉండడం గమనార్హం. ఎవరి కంట పడకుండా ఆమె చున్నితో కుక్కను దాచిపెట్టింది. సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. కుక్క చోరీకి గురైందనే బాధతో రెండు రోజులుగా యజమాని నారాయణ కుటుంబం తీవ్ర నిరాశలో ఉందని తెలిపారు. నారాయణకు ఇద్దరు కూతుర్లు ఉండగా ఈ కుక్కను మూడో కూతురుగా చూసుకుంటున్నామని తెలిపారు. దయచేసి తమ కుక్కను తిరిగి ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో కుక్కలు, పిల్లులను పెంచుకోవడం విపరీతంగా పెరిగింది. సోషల్ మీడియాలోని వీడియోలే ఇందుకు సాక్ష్యం. కేవలం ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 10,500 పెంపుడు కుక్కలు నమోదై ఉండగా, రిజిస్టర్ కానివి మరో 42 వేలున్నాయి. నగరాలు, పట్టణాల్లో ఇటీవల పెట్ క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్స్ సెంటర్లు మరింత అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం కమర్షియల్ లైసెన్స్‌లు తీసుకున్న పెట్ క్లినిక్‌లు తెలంగాణలో 1,012 ఉన్నాయి.
భూములు లాక్కొని సొంత ఆస్తి మాదిరిగా కొట్టుకుంటున్నారు: పవన్ కల్యాణ్
'ప్రేమించిన అమ్మాయికి ఉద్యోగం' - తను కుటుంబానికి ఏమీ చేయలేకపోతున్నానని మనస్థాపం