ETV Bharat / state

తీవ్ర విషాదం - రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి - ఆడుకుంటున్న సమయంలో ఘటన - Medchal Train Accident Three Died - MEDCHAL TRAIN ACCIDENT THREE DIED

Three People Died Hit by Train : మేడ్చల్‌ జిల్లా గౌడవెల్లి రైల్వేస్టేషన్ వద్ద రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతుడు రాఘవేంద్రనగర్‌కు చెందిన రైల్వే లైన్‌మెన్‌ కృష్ణ కుటుంబంగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

MEDCHAL TRAIN ACCIDENT THREE DIED
MEDCHAL TRAIN ACCIDENT THREE DIED (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 11, 2024, 7:06 PM IST

Three People Died Hit by Train : మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఆదివారం సాయంత్రం గౌడవెల్లి రైల్వే స్టేషన్‌లో తండ్రి, ఇద్దరు కుమార్తెలను రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మృతుడిని మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన కృష్ణగా గుర్తించారు. గౌడవెల్లిలో రైల్వే స్టేషన్‌లో రైల్వే ట్రాక్‌చెకింగ్‌గా పని చేస్తాడని స్థానికులు చెబుతున్నారు.

ఆదివారం కావడంతో తన ఇద్దరు కుమార్తెలను తీసుకొని పనికి వచ్చాడు. కృష్ణ పనిచేస్తుండగా ఇద్దరు కుమార్తెలు రైల్వే పట్టాలపై ఆడుకుంటున్న సమయంలో, రైలు అటుగా రావడం గమనించిన కృష్ణ ఇద్దరు కుమార్తెలను కాపాడబోయి రైలు ఢీకొని మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరు పిల్లలను వర్షిత, వర్షిణిగా స్థానికులు చెప్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

కుమారుడు సజీవ దహనం- అంత్యక్రియల కోసం సంచిలో అస్తికలతో తండ్రి - Son Died In Belagavi Fire Accident

ప్రేమకు చిహ్నంగా పండంటి బిడ్డ - అంతలోనే తెగిపోయిన బంధం - WOMAN DIES 10 DAYS AFTER DELIVERY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.