ETV Bharat / state

ఆగిన కన్న తల్లి గుండె- తల్లడిల్లిన కనుపాపలు

తిరిగిరాని లోకాలకు వెళ్లిన అమ్మ పడుకుందనుకుంటున్నారు ఆ చిన్నారులు. 'అమ్మా లే' అంటూ పిలుస్తుంటే స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.

three_children_orphaned_by_the_death_of_their_mother_in_kurnool_district
three_children_orphaned_by_the_death_of_their_mother_in_kurnool_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2024, 10:29 AM IST

Three Children Orphaned by The Death of Their Mother in Kurnool District : కూలిపనులకు వెళ్లిన తల్లి రోజూ కంటే ఈ రోజు కొంత ముందుగానే ఇంటికి వచ్చింది. అమ్మ వచ్చిందని ముగ్గురు పిల్లలు పరుగున ఆమె వద్దకు చేరారు. అమ్మ పిల్లలను ఒడిలోకి తీసుకొని ముద్దాడారు. సేద తీరేందుకు ఇంటి వసారాలో ఉన్న మంచంపై నడుం వాల్చారు. అమ్మ అలసిపోయిందని అనుకున్నారా పిల్లలు. కొద్దిసేపటి తర్వాత అమ్మా అని పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. ఎంత పిలిచినా అమ్మ లేవడం లేదు. ఇరుగుపొరుగువారు వచ్చారు ఆమెను కదిలించి చూశారు.

అప్పటికే ఆ తల్లి లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. 'అక్కా.. అమ్మ నిద్రపోతోందా?' అని చిన్నారి అడిగిన తీరు చూసి, అక్కడున్న వాళ్ల కళ్లు చెమర్చాయి. అల్లరి చేయొద్దు, ఆడుకుంటూ ఇంటి పట్టునే ఉండండి అని చెప్పే అమ్మ మాటలు మూగబోయాయి. ఆకలైతే అన్నం కలిపి తినిపించే గోరుముద్దలు దూరమయ్యాయి. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని చందోలి గ్రామంలో ఆదివారం జరిగింది.

కుటుంబ కలహాలు - ఇద్దరు కుమారులతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం

పత్తికొండ మండల పరిధిలోని చందోలి గ్రామానికి చెందిన టి.లక్ష్మి(35)ని తుగ్గలి మండలంలోని మారెళ్ల గ్రామానికి చెందిన అంజనయ్యకు ఇచ్చి వివాహం చేశారు. దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. రెండేళ్ల కిందట లక్ష్మి భర్త అంజనయ్య గుండెపోటుతో మృతి చెందారు. అత్తగారింట నా అన్నవాళ్ల నుంచి ఆదరణ లేకపోవటంతో లక్ష్మి చిన్నారులతో కలిసి పుట్టింటికి చేరింది. అక్కడే కూలిపనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ జీవనం సాగించేది. ఆదివారం కూలిపనుల నుంచి ఇంటికొచ్చిన ఆమె సేద తీరుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లింది.

ఆనందంగా కుమార్తెను స్కూల్​కు పంపింది - అంతలోనే ఆ తల్లికి - Woman Died in Road Accident

అగమ్యగోచరంగా చిన్నారుల పరిస్థితి : భర్త చనిపోయిన రెండేళ్లకే లక్ష్మి మృత్యు ఒడికి చేరింది. పుట్టింట్లో సైతం తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ముగ్గురు ఆడపిల్లల చదువుతున్న కోసం తానెంతో కష్టపడేది, పెద్దమ్మాయి జయశ్రీ ఏడో తరగతి, అంకిత నాలుగో తరగతి చదువుతన్నారు. చిన్న కుమార్తె ఉషశ్రీకి ఐదేళ్లు. తల్లిదండ్రులు దూరమవడంతో ఆ పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. అప్పటి వరకు ఎంతో ఆప్యాయంగా పలకరించిన అమ్మ ఇక ఎప్పటికీ రాదన్న విషయం తెలియని ఆ చిన్నారులు తల్లి మృతదేహం వద్ద దిగులుగా కూర్చున్న దృశ్యం పలువురిని కలచివేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.