ETV Bharat / state

జాగ్రత్త - ఇంటికి తాళం వేశారో అంతా మాయమే - Thieves Robbery at House In kadapa

Thieves Robbery at House in kadapa: ఇంటికి తాళం వేస్తే కన్నం పడినట్లే. ఆ జిల్లా ప్రజలకు గత నెల రోజుల నుంచి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు దొంగలు. బంధువుల ఇంటికి వెళ్లాలన్నా, విహారయాత్రలకు వెళ్లాలన్నా, చివరికి ఎవరైనా చనిపోతే చూసేందుకు వెళ్లాలన్నా ప్రజలు భయపడుతున్నారు. ఇంటికి తాళం వేసినట్లు కనిపిస్తే చాలు అదే రోజు పట్టపగలైనా కొల్లగొడుతున్నారు. జిల్లాలో గడిచిన నెల రోజుల వ్యవధిలోనే దాదాపు పది నుంచి 15 దొంగతనాలు జరిగాయి. కానీ పోలీసులు నిర్వహిస్తున్న గస్తీ దొంగలను కట్టడి చేయలేకపోతున్నాయి.

Thieves Robbery at House In kadapa
Thieves Robbery at House In kadapa (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 1:49 PM IST

Updated : Aug 12, 2024, 2:05 PM IST

Thieves Robbery at House In kadapa : వైఎస్సార్ జిల్లాలో సుమారు 24 లక్షల మంది జనాభా ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం 3 వేల మంది ఉన్నారు. ఈ మూడు వేల మంది పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలం చెందుతున్నారు. గడిచిన నెల రోజుల్లో జిల్లాల వరుస దొంగతనాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇంటికి తాళం వేస్తే చాలు దొంగలు ఏకంగా తాళాలను సైతం పగలగొట్టి ఇళ్లలో చొరబడుతున్నారు. బీరువాలను పగలగొట్టి డబ్బులను బంగారు నగలను దోచుకెళ్తున్నారు.

ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న సొమ్ము దొంగల పాలవుతుంది. రాత్రి వేళల్లో చోరీలు జరగడం పరిపాటయితే ఏకంగా పట్టపగలు దొంగలు కొల్లగొట్టడం పోలీసులకు సవాల్​గా మారింది. ఇటీవల కడప ప్రకాష్ నగర్​లో తాళం వేసిన ఇంటిలో దొంగలు చొరబడి సుమారు నాలుగున్నర లక్షల రూపాయల నగదు పది తులాల బంగారాన్ని కొల్లగొట్టారు. అలానే రాజు పార్కుకి వెళ్లే దారిలో వరుసగా మూడు దుకాణాల పైకప్పులను తొలగించి దొంగలు దుకాణాల్లో ఉన్న సామగ్రిని నగదును దొంగలించారు. కడప ఓంశాంతి నగర్​లో తాళం వేసిన ఇంట్లో దొంగలు చొరబడి మూడు లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలను దొంగలించారు.

కనిపెట్టారు - బైక్​ నుంచి రూ.3.5 లక్షలు కొట్టేశారు - సీసీటీవీలో దృశ్యాలు - Theft Case in Uravakonda

గస్తీ ఎక్కడ? : ఇలా జిల్లా మొత్తం గత నెల రోజుల్లోనే సుమారు 10 నుంచి 15 భారీ దొంగతనాలు జరిగాయి. లక్షల రూపాయలు దొంగల పాలయ్యాయి. జిల్లాకు వచ్చిన కొత్త ఎస్పీ హర్షవర్ధన్ రాజు తనదైన శైలిలో దొంగతనాలు నిర్మూలనకు కట్టుదిట్టమైన ప్రణాళికలు చేపడుతున్నప్పటికీ దొంగతనాలు జరగడం విడ్డూరంగా ఉంది. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. కానీ ఆ గస్తీ అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి.

పోలీసుల నిర్లక్ష్యం : ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో కేవలం ఇద్దరు మాత్రమే బ్లూ కోల్ట్స్ తిరుగుతున్నారు. పరిధి పెద్దది కావడంతో బ్లూ కోల్ట్స్ సంఖ్య తక్కువగా ఉండడంతో దొంగలు యదేచ్చగా చోరీలకు పాల్పడుతున్నారు. రాత్రి వేళల్లో బ్లూ కోల్ట్స్ సంఖ్యను పెంచి దొంగతనాలు నిర్మూలించాలని ప్రజలు కోరుతున్నారు. చోరీలు జరిగి నెలలు అవుతున్న బాధితులకు పోయిన సొమ్మును రికవరీ చేసి ఇవ్వడంలో పోలీసులు నిర్లక్ష్యం చూపుతున్నారు. చోరీలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు.

కారులో దర్జాగా వస్తారు - లారీలలో డీజిల్​ ఎత్తుకెళ్తారు - Diesel Theft At Rompicherla HighWay

రాత్రి వేళల్లో తిరుగుతున్న బ్లూ కోల్ట్స్ సంఖ్యను పెంచితే దొంగతనాలను నిర్మూలించవచ్చని ప్రజలు అంటున్నారు. ఇంటికి తాళాలు వేసి ఊర్లోకి వెళ్లే ప్రజలు ఎల్​హెచ్​ఎంఎస్ కెమెరాలను ఉపయోగించుకుంటే చోరీలను కట్టడి చేయవచ్చని పోలీసులు అంటున్నారు.

అవమానం జరిగిందని రగిలిపోయిన దొంగలు- ప్రతీకారంతో మళ్లీ చోరీ - Theft in Temple at Prakasam

Last Updated : Aug 12, 2024, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.